గోవిందరావుపేట, జనవరి23 : జంపన్నవాగులో పుణ్య స్నానా లు ఆచరిస్తుండగా ముగ్గురు ఒక్కసారిగా మునిగిపోవడంతో వారిని 5వ బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ బృందం కాపాడింది. మేడారం స మ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భూపాలపల్లి జిల్లా వాసులు మేకల జంపయ్య,
మేకల సరి త, మేకల శిరీషతో పాటు కుటుంబ సభ్యులు జంపన్నవా గు వద్దకు స్నానాలు ఆచరిస్తుండగా ఒక్కసారిగా మునిగిపోతుండగా గమనించిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్స్ రాందాస్, ప్రవీణ్, రాజశేఖర్, రవి, హరీశ్‌ను కమాండెంట్ సుబ్రహ్మణ్యం అభినందించారు.