నమస్తే నెట్వర్క్, జూన్ 12 : వేసవి సెలవుల్లో ఆటపాటలతో సరదాగా గడిపిన విద్యార్థులు గురువారం బడి బాట పట్టారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకోవడంతో ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రులతో కోలాహలంగా మారాయి. ఉపాధ్యాయులు పాఠశాలలను అం దంగా తీర్చిదిద్దారు. విద్యాలయాల సిబ్బంది, స్వచ్ఛ వర్కర్లు తరగతి గదులను పూలు, మామిడితోరణాలు, బెలూన్స్‌తో అలంకరించారు. ఈ సందర్భంగా డీ ఈవోలు, ఎంఈవోలు, ఉపాధ్యాయులు విద్యార్థులకు పూలిచ్చి స్వాగతం పలికారు. అనంతరం యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందించారు.
హనుమకొండ న్యూశాయంపేటలోని పోచంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభ కార్యక్రమాన్ని ఎంపీ డాక్టర్ కావ్య, కలెక్టర్ ప్రావీణ్య, డీఈవో వాసంతితో కలిసి ప్రారంభించా రు. విద్యార్థులకు పుస్తకాలు, ఏకరూప దుస్తులు అం దజేశారు. వర్ధన్నపేట మండలంలోని ల్యాబర్తి ప్రభుత్వ పాఠశాలలో బాలలకు స్కూల్ యూనిఫామ్స్, పుస్తకాలు, నూతనంగా చేరిన వారికి వరంగల్ కలెక్టర్ సత్యశారద అడ్మిషన్ పత్రాలు అందించారు. జనగామ జిల్లా నర్మెట మండలంలోని ఆగాపేట, మాన్సింగ్తండా, కేజీబీవీలను డీఈవో భోజన్న సందర్శించి విద్యార్థులకు పూలతో స్వాగతం పలికారు.
చిట్యాల మండలం నైన్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భూపాలపల్లి డీఈవో రాజేందర్ పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. మహబూబాబాద్ మండలంలోని బ్రాహ్మణపల్లి లక్ష్మీపురం ప్రాథమికోన్నత పాఠశాలలో డీఈ వో రవీందర్ విద్యార్థులకు పూలతో స్వాగతం పలికారు. మొదటి రోజు నామమాత్రంగా హాజరయ్యా రు. కాగా, హనుమకొండ లష్కర్ బజార్‌లోని మర్కజీ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో తోరణాలు, పూలు కట్టించారు.