బిల్లు రాలేదని బడికి తాళం
పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు తొలిరోజే చేదు అనుభవం ఎదురైంది. ప్రాథమిక పాఠశాల అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లు చెల్లించలేదని ఏకంగా ఓ కాంట్రాక్టర్ పాఠశాల గేట్‌కు తాళం వేశారు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకీస గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో కాంట్రాక్టర్ రామనాథం ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో భాగంగా 2023లో పలు అభివృద్ధి పనులు చేపట్టారు.
- తొలి రోజు విద్యార్థులు, ఉపాధ్యాయులకు చేదు అనుభవం
- రెండు గంటలపాటు పాఠశాల వేళలకు అంతరాయం
డోర్నకల్, జూన్ 15 : పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు తొలిరోజే చేదు అనుభవం ఎదురైంది. ప్రాథమిక పాఠశాల అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లు చెల్లించలేదని ఏకంగా ఓ కాంట్రాక్టర్ పాఠశాల గేట్‌కు తాళం వేశారు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకీస గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో కాంట్రాక్టర్ రామనాథం ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా 2023లో పలు అభివృద్ధి పనులు చేపట్టారు.
మొత్తం బిల్లులు రూ.40 లక్షలు కాగా, రూ.7 లక్షలు మాత్రమే వచ్చాయని, మిగిలిన రూ.33 లక్షలు బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. పెండింగ్ బిల్లుల కోసమే ఎంపీపీఎస్ పాఠశాల గేట్‌కు తాళం వేసినట్లు తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి అంగోత్ లక్ష్మా, ఎస్సై ఝాన్సీ, ఉపాధ్యాయులు కాంట్రాక్టర్ రామనాథంతో మాట్లాడడంతో సమస్య సద్ధుమణిగింది. రెండు గంటల తర్వాత విద్యార్థులను పాఠశాల భవనంలోకి పంపించారు. అనంతరం డీఈవో సత్యనారాయణమూర్తి పాఠశాలను తనిఖీ చేసి, అభివృద్ధి పనులు, పెండింగ్ బిల్లుల వివరాలు సేకరించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

