పాఠశాలలకు ప్రభుత్వం గురువారం నుంచి వేసవి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. వార్షిక పరీక్షలు ముగియడం, బుధవారం స్కూళ్లకు చివరి పనిదినం కావడంతో ఎంజేపీ, కేజీబీవీ, ఇతర ఆశ్రమ పాఠశాలలకు విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకున్నారు.
తమ పిల్లల పెట్టే బేడె సర్ధి సొంతూళ్లకు తీసుకొని వెళ్లారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రయాణ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. పలువురు బైక్లు, కార్లలో బయలుదేరగా, మరికొందరు బస్సులు, ఇతర వాహనాలను ఆశ్రయించి ఇళ్లకు చేరుకున్నారు. కాగా, వేసవి సెలవులు ముగిసిన అనంతరం జూన్ 12న పాఠశాలలు తిరిగి తెరచుకోనున్నాయి.
– నమస్తే నెట్వర్క్