చేనేత సంఘాల్లో ఎన్నికల సందడి!
ఎట్టకేలకు ప్రాథమిక చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ విడుదల చేయడంతో పాటు ఈ నెల 4 నుంచి 33 రోజుల సమాయాన్ని ఇచ్చింది.
- ఓటర్ల జాబితాకు షెడ్యూల్ విడుదల
- తొలిసారి కోఆపరేటివ్ అథారిటీ ద్వారా నిర్వహణ
- ఉమ్మడి జిల్లాలో 66 సంఘాలు.. 11,098 మంది సభ్యులు
శాయంపేట, ఏప్రిల్ 1 : ఎట్టకేలకు ప్రాథమిక చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ విడుదల చేయడంతో పాటు ఈ నెల 4 నుంచి 33 రోజుల సమాయాన్ని ఇచ్చింది. మేలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేందకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. 2018 ఫిబ్రవరిలోనే సంఘాల పదవీకాలం ముగియగా దానిని పొడిగిస్తూ వస్త్తున్నారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 66 సంఘాల్లో 11,098 మంది సభ్యులున్నారు. గతంలో చేనేత, జౌలిశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోఆపరేటివ్ అథారిటీ ఎలక్షన్స్ జరుగుతాయి.
ఈసారి సంఘంలో వాటాధనం రూ. 300 కంటే తక్కువున్న, చనిపోయిన, రాజీనామా చేసిన వారితో పాటు డిఫాల్టర్ల పేర్ల తొలగింపు చేపట్టడంతో పాటు ఓటర్ల జాబితాలో ఫొటోను తప్పనిసరి చేశారు. అలాగే ఏడాది ముందుగా సభ్యుడైన వారికే ఓటు హక్కు కల్పించడంతో కొత్త ఓటర్లకు అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల ఖర్చును సంఘాలే భరించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి సంఘం జాబితాతో పాటు రూ. 5 వేల డీడీనీ అథారిటీకి పంపించాలి. ఒక్కో సంఘంలో తొమ్మిది మంది డైరెక్టర్లను బ్యాలెట్ పద్ధతిన ఎన్నుకోవాలి. వీరిలో ఏడుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉండనున్నారు. వచ్చిన నామినేషన్ల ఆధారంగా గుర్తులు కేటాయించి ఎన్నికలు నిర్వహించడం లేదా ఏకగ్రీవాలను ప్రకటించడం ఉంటుంది.
సంఘాలు.. సభ్యులు
హనుమకొండ జిల్లాలో 17 సంఘాల్లో 2,898 మంది సభ్యులున్నారు. అలాగే జనగామ జిల్లాలో 12 సంఘాల్లో 1,500, వరంగల్‌లో 30 సొసైటీల్లో 5,300, భూపాలపల్లిలోని ఏడు సంఘాల్లో 1,400 మంది సభ్యులున్నట్లు అధికారులు తెలిపారు. మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో చేనేత సంఘాలు లేవని అధికారులు స్పష్టం చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

