నర్సంపేట/వర్ధన్నపేట/ఖానాపురం, జనవరి 3: సావిత్రీబాయి ఫూలే జయంతిని మంగళవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహిళల కోసం ఫూలే చేసిన సేవలను వక్తలు కొనియాడారు. ఇందులో భాగంగా నర్సంపేటలోని మున్సిపల్ కార్యాలయంలో సావిత్రీబాయి ఫూలే 192వ జయంతిని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడారు. మహిళల అభ్యున్నతికి సావిత్రిబాయి ఫూలే కృషి మరువలేనిదన్నారు. ఆడపిల్లలకు విద్య నేర్పించడంలో ఆమె ముందున్నారని కొనియాడారు. మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా సావిత్రీబాయి పని చేశారని గుర్తుచేశారు. మహిళలు ఆమె అడుగుజాడల్లో నడువాలని పిలుపునిచ్చారు.
మున్సిపల్ కమిషనర్ వెంకటస్వామి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అలాగే, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు పంజాల రమేశ్ ఆమె సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఏబీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేశ్, రవీందర్, సంతోష్, మను, సిద్ధు, ప్రవీణ్, సుప్రియ పాల్గొన్నారు. అంతేకాకుండా వర్ధన్నపేటలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, కమిషనర్ గొడిశాల రవీందర్ ఆధ్వర్యంలో సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం వర్ధన్నపేట ఉత్తమ మున్సిపాలిటీగా ఎంపికైనందున పలువురు నాయకులు పాలక మండలి సభ్యులను సత్కరించారు. ఉప్పరపల్లి ప్రభుత్వ పాఠశాలలో సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ కోమాండ్ల ఎలేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో సావిత్రీబాయి జయంతి వేడుకలు నిర్వహించారు. ఎస్వో మేనక ఆధ్వర్యంలో ఫూలేకు ఘనంగా నివాళులర్పించారు.
సావిత్రీబాయిని స్ఫూర్తిగా తీసుకోవాలి
నర్సంపేటరూరల్/గీసుగొండ/చెన్నారావుపేట/దుగ్గొండి/రాయపర్తి: స్త్రీ విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి, తొలి మహిళా టీచర్ సావిత్రీబాయి ఫూలేను స్ఫూర్తిగా తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘం నేతలు కోరారు. నర్సంపేటలోని ఎమ్మార్సీ కార్యాలయంలో పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు ఈదునూరి రవీందర్‌రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు శాన ఉమామహేశ్వర్, నర్సంపేట మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోపాల్‌రెడ్డి, కోడెం సాంబయ్య, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు తిరుపతిరెడ్డి, భాస్కర్ సావిత్రీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్నో సమస్యలపై ఆమె మడమ తిప్పని పోరాటం చేశారని రవీందర్‌రెడ్డి కొనియాడారు.
సావిత్రీబాయిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు సోనబోయిన సారంగపాణి, శోభన్‌బాబు, వీరన్ననాయక్, శ్యామ్‌సుందర్, విజేందర్, ముజీబుర్ రహమాన్ పాల్గొన్నారు. కాగా, నర్సంపేట ద్వారకపేట తెలంగాణ ముస్లిం మైనార్టీ గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ తాళ్ల నీలిమాదేవి సావిత్రీబాయి పూలే అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడపిల్లల చదువు, విద్యాభివృద్ధికి తాను చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేశారన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో త్వరలో మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆమె అవార్డు అందుకోనున్నారు.
గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంట జడ్పీహెచ్ఎస్లో హెచ్ఎం అనిత సావిత్రీబాయి చిత్రపటానికి పూలమాల వేసి ఆమె సేవలను వివరించారు. ఫూలే సంఘ సంస్కర్త, ఉపాధ్యాయురాలు, రచయిత్రి అని, కులమతాలకతీతంగా ప్రజలను ప్రేమించిన మహనీయురాలని కొనియాడారు. కార్యక్రమంలో స్థానికులు క్లిమెంట్, కొమురారెడ్డి, ప్రవీణ్, నర్సయ్య, సుమన్, సంపత్, రాజ్‌కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చెన్నారావుపేట కేజీబీవీలో ప్రత్యేక అధికారి జ్యోతి ఆధ్వర్యంలో సావిత్రీబాయి ఫూలే జయంతి నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, నృత్య, నాటక పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంధ్య, సబిత, రాజ్యలక్ష్మి, షహీనా, మంజుల, సరస్వతి, కమలమ్మ, సుమలత, స్వరూప, దేవిక, అనిత, సుజాత, మౌనిక, నాగరాణి, రజిత పాల్గొన్నారు. దుగ్గొండి మండలం గిర్నిబావి ఎంజేపీటీలో సావిత్రీబాయి జయంతి సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, నృత్య, నాటక పోటీలు నిర్వహించారు.
కార్యక్రమంలో ప్రత్యేక అధికారి కూరోజు దేవేందర్, ఎంపీటీసీ ప్రభాకర్, ఉపాధ్యాయులు రాజు, సుకుమార్, సోమరాణి, సురేశ్, కోటి, బషీర్, కరణ్, రమేశ్, సుభాష్, కరుణాకర్, సంతోష్, కృష్ణమూర్తి, సతీశ్, ప్రేమలత, కోమల పాల్గొన్నారు. రాయపర్తిలోని రాజీవ్ చౌరస్తాలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జయకుమారి, గ్రంథ పాలకురాలు ఎర్రబెల్లి గీతారావు, ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు అజ్మీరా ఉమాదేవి, పాక పద్మావతి, అంగన్వాడీ టీచర్ వీద చంద్రకళను ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీ అయిత రాంచందర్, రెంటాల గోవర్ధన్‌రెడ్డి సన్మానించారు. అలాగే, మండలకేంద్రం, సన్నూరులోని ఉన్నత పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులను సత్కరించారు.
ఫూలే సేవలు మరువలేనివి..
కరీమాబాద్: సావిత్రీబాయి ఫూలే సేవలు మరువలేనివని వక్తలు అన్నారు. అండర్‌రైల్వేగేట్ ప్రాంతంలోని పలు విద్యాలయాలు, డివిజన్లలో సావిత్రీబాయి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫోర్టురోడ్డులోని ఏఎస్ఎం కళాశాలలో విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించారు. ఖిలావరంగల్‌లోని పడమరకోటలో సావిత్రీబాయి జయంతిని తెలంగాణ సాహితీ కళాకారుడు బొడ్డు కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. 37, 38 డివిజన్ల కార్పొరేటర్లు బోగి సువర్ణా సురేశ్, బైరబోయిన ఉమా దామోదర్‌యాదవ్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శంభునిగుడి ధర్మకర్త నలిగొంటి నవీన్, పీఏసీఎస్ డైరెక్టర్ తోటకూరి నర్సయ్య, బీఆర్ఎస్ నాయకులు మేకల ఎల్లయ్య, నలిగంటి పాల్, బెల్లంకొండ రమేశ్, నలిగంటి అనిల్, సుతారి సారంగపాణి పాల్గొన్నారు. అలాగే, శివనగర్‌లోని తమ్మెర భవనంలో సావిత్రీబాయి ఫూలే జయంతిని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ల్యాదల్ల శరత్, ఇసంపెల్లి ఇందు, శ్రవంతి, సాగర్, శివ, ఖలీల్, సోను పాల్గొన్నారు.
చిరస్మరణీయురాలు సావిత్రీబాయి..
పోచమ్మమైదాన్: సామాజిక విప్లవకారిణి అయిన సావిత్రీబాయి చిరస్మరణీయురాలని బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు అన్నారు. పోచమ్మమైదాన్ సెంటర్లో జిల్లా సమితి ఉపాధ్యక్షుడు పరికిరాల రమేశ్ ఆధ్వర్యంలో ఫూలే జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వెంకట్రాములు మాట్లాడుతూ సావిత్రీబాయి చదువుల తల్లిగా పేరొందినట్లు తెలిపారు. ఆమె భర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహంతో 1848లో దేశంలోనే తొలి బాలికా పాఠశాలను పుణెలో ప్రారంభించారని గుర్తుచేశారు.
కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి బుస్స రవీందర్, జన్ను రవి, బూజుగుండ్ల రమేశ్, మహిళా సమాఖ్య కార్యదర్శి తాళ్లపల్లి రహేలా, మార్కండేయ పాల్గొన్నారు. అలాగే, దేశాయిపేటలోని పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద స్వర్ణభారతి యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సావిత్రీబాయి ఫూలే జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కావటి కవితా రాజుయాదవ్ ఆమె చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో హెల్త్ సెంటర్ సూపర్వైజర్ జన్ను కోర్నెలు, సామాజిక వేత్త డాక్టర్ పాలడుగుల సురేందర్, వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు పాలడుగుల నిర్మల, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.