కొత్తగూడ/కురవి/డోర్నకల్, డిసెంబర్ 14: అభివృద్ధిని మరిచిపోయి కమీషన్ల కోసం మంత్రులే పాకులాడుతున్నారని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం, కురవి, మండలకేంద్రంలో ఏర్పా టు చేసిన సమావేశాల్లో పాల్గొన్నారు. డోర్నకల్ మండ లం రాత్రి చాప్‌ల తండాలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో సత్యవతి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో పనులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తే.., వాటిని మళ్లీ ప్రారంభించుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.
కల్యాణలక్ష్మి పథకాన్ని ములుగు నియోజకవర్గంలో ఒక సన్నివేశాన్ని చూసి కలత చెందిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ములుగుకు ట్రైబల్ యూనివర్సిటీని తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌ది కాదా.., మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ప్రతి ఇంటి మహిళకు రూ. 2500 ఇస్తామని, పెన్షన్ రూ.4వే లు చేస్తామని ఇచ్చిన హామీని విస్మరించారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు తులం బంగారం హామీ ఏమైందన్నా రు. ఇలాంటి పథకాలను అమలుచేయకుండా ఓటర్లు, నిలబడిన అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తున్నారన్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను కేసీఆర్ హయాంలోనే రూ.వంద కోట్లకుపైగా నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేశారన్నారు.
ఇప్పుడు రూ.75 కోట్ల నిధులను మంజూరు చేశారని, వాటిలో కమిషన్ల కోసం మంత్రులు తగువులాడుకుంటున్నదని నిజం కాదా అని ప్రశ్నించారు. యాసంగిలో పంటలు సాగు చేస్తున్న రైతులకు యూరియా లేక ఇబ్బందిపడుతుంటే రూ.100 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడానికి వెళ్లడమేంట ని ప్రశ్నించారు. కేసీఆర్‌తోనే తండాల్లో సమగ్రాభివృద్ధి జరిగిందని, చాప్లతండా గ్రామ పంచాయతీకి మాజీ సర్పంచ్ బానోత్ పాం డూనాయక్ రాష్ట్ర, జాతీయస్థాయిలో గుర్తిం పు తీసుకొచ్చినట్లు తెలిపారు. కురవిలో నూతకి నర్సింహారావు, బాదావత్ లక్ష్మీరాజూనాయక్, బాదె నాగయ్య, సంగెం భరత్, మేక నాగిరెడ్డి, చిన్నం భాసర్, డోర్నకల్‌లో మాజీ సర్పంచ్ పాండూనాయక్ , మాజీ ఉప సర్పంచ్ మోహన్, మండల అధ్యక్షుడు వేణు, సర్పంచ్ అభ్యర్థి శ్యామల తిరుపతి, మండల అధికార ప్రతినిధి బానోత్ నెహ్రూ, బానోత్ వీరన్న, శ్రీనివాస్ పాల్గొన్నారు.