ఐనవోలు, జూన్ 4 : నియోజకవర్గ ప్రజల క్షేమమే తన ధ్యేయమని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మల్లికార్జున గార్డెన్స్‌లో అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వీవోఏలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఫౌండర్ మెంబర్ అరూరి కవిత కుమారితో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు.
ఈ సందర్భంగా అరూరి మాట్లాడుతూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో గురుపూజోత్సవం రోజు గురువులను ఘనంగా సన్మానించినట్లు తెలిపారు. అలాగే, నిరుపేద విద్యార్థులకు విద్యనందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఎంపీపీలు మార్నేని మధుమతి, సునీత, కమల, అప్పారావు, జడ్పీటీసీ భిక్షపతి, మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ జయపాల్, జడ్పీ కోఆప్షన్ మెంబర్ ఉస్మాన్అలీ, ఏపీఎం రాజ్‌కుమార్, వేణు, కోటేశ్వర్, సీసీలు, వీవోఏలు పాల్గొన్నారు.