భీమదేవరపల్లి, జనవరి 18 : కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో నిరంతర సేవలందించిన పారిశుధ్య కార్మికులకు ఆదివారం ఘన సన్మానం జరిగింది. ఆలయ చైర్మన్ అశోక్ ముఖర్జీ, ఈవో కిషన్ రావు, డైరెక్టర్లు కలిసి ఒక్కొక్కరికి శాలువా కప్పి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ అశోక్ ముఖర్జీ మాట్లాడుతూ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో పారిశుద్ధ్య కార్మికులు ఎనలేని సేవ చేశారని ప్రశంసించారు. వీరిని ఎంత సన్మానించిన తక్కువే అన్నారు. జాతరలో పారిశుధ్య కార్మికులు చేసిన సేవలు వెల కట్ట లేమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో నాగరాజు, పంచాయతీ కార్యదర్శులు, ఆలయ అర్చకులు, డైరెక్టర్లు పాల్గొన్నారు.