ములుగు, మే 22(నమస్తే తెలంగాణ): ములుగు జిల్లాలో అడ్డూఅదుపు లేని వేగంతో దూసుకొస్తున్న ఇసుక లారీలతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మద్యం మత్తు, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలతో రహదారులు రక్తమోడుతున్నాయి.
ఎన్‌హెచ్-163 ఎక్కువగా విస్తరించి ఉన్న ఈ జిల్లాలో భద్రాచలం, చందుపట్ల, ఏటూరునాగారం, మణుగూరు రోడ్లపై ఉన్న మూలమలుపులకు తోడు రోడ్ల నిర్మాణ లోపాలు, నిర్వహణ లేమికి తోడు నియంత్రణ, భద్రతా చర్యలు కరువై ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుండగా మరికొందరు క్షతగాత్రులుగా మారి వారి కుటుంబీకులకు తీరని దుఃఖాన్ని మిగుల్చుతోంది. ఆధ్యాత్మిక, పర్యాటకానికి నెలవైన ఈ ప్రాంతానికి తెలంగాణ నుంచే గాక వివిధ రాష్ర్టాల నుంచి వచ్చే సందర్శకులూ రోడ్డు ప్రమాదాలకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా భారీ వాహనాలు, ముఖ్యంగా ఇసుక లారీల వేగానికి కళ్లెం వేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
నియంత్రణ చర్యలు ఏవీ?
ములుగు జిల్లాలో ఇసుక లారీలు ప్రజల ను హడలెత్తిస్తున్నాయి. మద్యం మత్తు, మితిమీరిన వేగం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుండగా ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట ద్విచక్ర వాహనదారులు, బాటసారులు మృత్యువాతపడుతున్నారు. అయితే నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు నియంత్రణ చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. రోడ్ల విస్తరణ పనులు చేపట్టినప్పటికీ రోడ్డు భద్రతపై దృష్టి సారించకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.
మల్లంపల్లి, ములుగు మండలాలతో పాటు గట్టమ్మ ఆలయ సమీపం, ఎర్రిగట్ట మ్మ మూలమలుపు, గోవిందరావుపేట మండలం సోమలగడ్డ క్రాస్‌రోడ్డు, ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి, వాజేడు మండలం జగన్నాథపురం వై జంక్షన్, మంగపేట మండలం తిమ్మంపేట క్రాస్‌రోడ్డు, చుంచుపల్లి, వెంకటాపురం(నూగూరు) మండలం రామాంజాపురం, విజయపురి కాలనీ, నూగూరు వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ప్రమాదాలు జరిగిన సమయంలో అధికారులు హడావిడిగా తనిఖీలు చేస్తున్నప్పటికీ ఆ తర్వాత రక్షణ చర్యలను నిర్లక్ష్యం చేస్తున్నా రు. రోడ్డు భద్రతా వారోత్సవాలప్పుడు మాత్రమే అవగాహన కల్పించి ఆ తర్వాత నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో వేగంగా వెళ్లి టౌన్లలో వేగాన్ని తగ్గించాల్సిన ఇసుక లారీలు ఆయా మండలాల్లోని టౌన్లలో సైతం వేగాన్ని త గ్గించడం లేదు. నిత్యం ఓవర్‌స్పీడ్‌తో పాటు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా హారన్ సౌండ్ల తో రయ్య్ అని దూసుకుపోతూ బీభత్సం సృష్టిస్తున్నారు.
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలు