కాజీపేట, జూన్ 16: సమాజంలోని ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సఖి లీగల్ కౌన్సిలర్ శ్రీదేవి అన్నారు. కాజీపేట కమ్యూనిటీ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సఖి వన్ స్టాప్ సెంటర్, సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళలు, యువతుల కోసం ఐదు రకాల సేవలు అందించబడతాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆపదలో ఉన్న వారికి కౌన్సిలింగ్ సహాయం, న్యాయ, వైద్య, పోలీస్, తాత్కాలిక వసతి సేవలను ఉపయోగించుకునే అవకాశాలను గురించి వివరించారు. సఖి సెంటర్ 24గంటలు పని చేస్తుందని తెలిపారు. సమస్యల్లో ఉన్న మహిళలు 181 మహిళ హెల్ప్ లైన్, చైల్డ్ లైన్ నెంబర్ 1098, 0870-2452112 ,7382983088 నెంబర్ల కు కాల్ చేసి బాధిత మహిళలు సహాయం పొందవచ్చు నని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఓ శ్రీనివాస్, సఖి కేసు వర్కర్ అనూష, తదితరులు, మహిళలు, యువతలు పాల్గొన్నారు.