హనుమకొండ, అక్టోబర్ 12 : ఆర్టీసీని లాభాలబాటలోకి తీసుకురావాలని ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా పర్యాటనలో భాగంగా ఆయన హనుమకొండలోని వరంగల్ రీజినల్ కార్యాలయంలో కార్యాలయంలో ఆర్ఎం డి.విజయభాను, డిపో మేనేజర్లు, ఇతర అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమస్యలపైఆర్ఎంను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బలోపేతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అనంతరం హనుమకొండ బస్ స్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు.
అనంతరం వరంగల్-1 డిపోలో ప్రగతి చక్రాల అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్ రీజియన్ పరిధిలో ఉత్తమ సేవలందించిన డ్రైవర్లు, కండక్టర్లకు ప్రగతిచక్రాల పురస్కారాలను అందించి వారిని అభినందించారు. అనంతరం ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీకి అధిక లాభాలు వచ్చేందుకు డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ అంటేనే ప్రజాసేవ అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆదాయాన్ని పెంచాలన్నారు. ఇంధననాన్ని పొదుపుగా వాడాలన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలన్నారు. ప్రజారవాణాను సేవగా చూడాలి కమర్షియల్‌గా కాదని సేవాభావంతో పనిచేయాలన్నారు.
ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు అందుకున్న .ఎం.లింగయ్య, కండక్టర్ జనగామ డిపో, డి.విజయ్‌కుమార్, కండక్టర్ భూపాలపల్లి డిపో, టి వెంకటేశ్వర్లు టిమ్ డ్రైవర్ వరంగల్-1 డిపో, బి.హరిసింగ్ టిమ్ డ్రైవర్, నర్సంపేట డిపో, బి జుమ్ము, అత్యధిక సంవత్సరాలు ఆక్సిడెంట్ రహిత డ్రైవింగ్ చేసిన డ్రైవర్, హనుమకొండ డిపో, బీడీ రెడ్డి అత్యధిక సంవత్సరాలు ఆక్సిడెంట్ రహిత డ్రైవింగ్ చేసిన డ్రైవర్, పరకాల డిపో, బి.మహేందర్ అత్యధిక ఆయిల్ ఆదా చేసిన డ్రైవర్, వరంగల్-1 డిపో, ఈ.ఓదెలు అత్యధిక ఆయిల్ ఆదా చేసిన డ్రైవర్ వరంగల్-1 డిపో పురస్కారాలు అందజేశారు.
అనంతరం వరంగల్-1 డిపో ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కరీంనగర్ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.సోలమన్, వరంగల్ రీజనల్ మేనేజర్ డి.విజయభాను, డిప్యూటీ రీజినల్ మేనేజర్ (ఆపరేషన్స్) భానుకిరణ్, డిప్యూటీ రీజినల్ మేనేజర్(మెకానికల్) మహేష్, తొమ్మిది డిపోల డిపో మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎండీని కలిసిన వరంగల్ జిల్లా స్టాల్ ఓనర్స్..
వరంగల్ జిల్లా స్టాల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు. అసోసియేషన్ సభ్యులు ఏ.ప్రవీణ్‌కుమార్, శ్రవణ్, అనిల్, నసీర్, సంపత్, వివేక్, సాయి ఉన్నారు.
హైర్‌బస్సు ఓనర్స్..
ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని హైర్‌బస్సు ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. రాష్ట్ర గౌరవాధ్యక్షుడు లక్కం ప్భాకర్, వరంగల్ రీజినల్ అధ్యక్షుడు మారిపెల్లి రామిరెడ్డి, కూరతోట సదానందం, హబిబ్బుద్దీన్, పర్వేజ్, కె.భాస్కర్‌రెడ్డి, గోపు వెంకన్న, టి.శ్రీనివాస్‌రెడ్డి, ఆర్.రాంబాబు, పి.శ్రీనివాస్ ఉన్నారు.