భీమదేవరపల్లి, జూన్ 23: సిద్దిపేట – హనుమకొండ ప్రధాన రహదారిపై గట్ల నర్సింగాపూర్ గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పిన ఘటనలో చిర్ర సుదర్శన్(60) అనే వృద్దుడు ఆదివారం మృతి చెందినట్లు ముల్కనూరు ఎస్ఐ నండ్రు సాయిబాబు తెలిపారు. ఎల్కతుర్తి మండలం జగన్నాధపూర్ గ్రామానికి చెందిన సుదర్శన్ స్థానికంగా ఆర్ఎంపీ వైద్యుడిగా సేవలందిస్తున్నారు. దీంతో పాటు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో ఒక దిన పత్రికలో విలేకరిగా పని చేస్తున్నాడు.
ఆదివారం హుస్నాబాద్ పట్టణంలో ఒక ఫంక్షన్ కు వెళ్లి రాత్రి తిరిగి వస్తుండగా బైక్ అదుపుతప్పి కింద పడగా తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ సాయిబాబు పరిశీలించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడికి భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. మృతుడి కొడుకు విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.