బచ్చన్నపేట, జూన్ 14 : బచ్చన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాలలో చెరువు శిఖం, కుంటల భూములలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్న ప్రభుత్వ రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిపిఎం బచ్చన్నపేట మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ ఆరోపించారు.
సిపిఎం కార్యాలయంలో శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. పలు గ్రామాలలో చెరువు మట్టిని రవాణా చేస్తూ ఇటుక బట్టీలు పెడుతూ అలాగే కలపను అక్రమంగా తరలిస్తున్న అలాగే ఈ బట్టీల ద్వారా పొల్యూషన్ ఏర్పడి రోడ్ల పైన వెళ్తున్నటువంటి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్న అధికారులు పట్టించుకోవడం శోచనీయమని అన్నారు. ఈ మండలంలో మట్టిని, కలపను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. చెరువులో మట్టి తీయడం వలన తొందరగా చెరువులు ఎండిపోయే ప్రమాదం ఉందని వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు రావుల రవీందర్ రెడ్డి , మిన్నెలాపురం ఎల్లయ్య, అశోక్ నాయకులు నరసింహులు, సుధాకర్, మనోహర్ గుండు రవి, తదితరులు పాల్గొన్నారు.