ఖిలావరంగల్: ఖిలావరంగల్ మండలంలోని వరంగల్ కోట, బొల్లికుంట గ్రామాలలో భూభారతి గ్రామ రెవిన్యూ సభలు తహసిల్దార్ బండి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. భూమి రికార్డులలో తప్పులు ఉన్నా రైతులు, అర్హత ఉండి రెవెన్యూ రికార్డుల్లో పేర్లు నమోదు కానివారు, ఇతర భూ సమస్యలు ఉన్నా భూ బాధితులు గ్రామ సభలకు భారీగా తరలివచ్చారు.
సమస్యాత్మకమైన భూములకు సంబంధించిన డాక్యుమెంట్ల జిరాక్స్లు దరఖాస్తుకు జత చేసి అధికారులకు అందజేశారు. కాగా గ్రామ సభలను వరంగల్ ఆర్డీవో సత్యపాల్ రెడ్డి సందర్శించారు. రైతులు సమస్యల పరిష్కారం కోసం గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులను పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.