హనుమకొండ (ఐనవోలు): మా గ్రామానికి బీటీ రోడ్లు వేయించాలని కోరుతూ కొండపర్తి గ్రామానికి చెందిన కట్కూరి సురేష్ అనే యువకుడు సోమవారం గ్రీవెన్స్ సెల్లో వినతి ప్రతం అందజేశానని తెలిపారు. కొండపర్తి నుంచి భట్టుపల్లికి, కొండపర్తి నుంచి మామునూర్, కొండపర్తి నుంచి ఐనవోలు గ్రామాలకు వెళ్లే బీటీ రోడ్లు లేక చాలా రోజులు అవుతుంది. గత ప్రభుత్వం హయాంలో బీటీ రోడ్లు పనులు ప్రారంభించారని, పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు. దీంతో గ్రామస్తులం రాకపోకలకు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నాం.
అసంపూర్తిగా ఉన్న రోడ్లతో అనారోగ్య పాలవుతున్నామని సురేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. శ్వాసకోశ సమస్యలు మరియు అనారోగ్యానికి గురౌతున్నాం. అంసపూర్తిగా ఉన్న రోడ్లు పై ప్రయాణం చేస్తుంటే వాహనాలు తరుచుగా దెబ్బతిని మరమ్మతు చేయించాల్సి వస్తుంది. కాలేజీలకు, స్కూల్స్ వెళ్లే విద్యార్థులు ఇలా అన్ని వర్గాల ప్రజల రాకపోకలు సాగిచండం చాలా కష్టంగా మారిందని తెలిపారు. కలెక్టర్ మేడమ్ ప్రత్యేక చొరవ తీసుకొని కొండపర్తి గ్రామానికి మూడు వైపులా బీటీ రోడ్లు పూర్తి చేయించాలని కోరినట్లు సురేష్ తెలిపారు.