మా పిల్లలతో మాట్లాడించరా?
తమ పిల్లలతో మాట్లాడనివ్వాలని తల్లిదండ్రులు శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే వసతి గృహం ఎదుట ఆందోళన చేపట్టారు. నిర్లక్ష్యపు సమాధానం చెప్పిన ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. రెండో శనివారం కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చూసేందుకు జ్యోతిబాఫూలే వసతి గృహానికి వచ్చారు.
- గణపురం ఎంజేపీ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన
- బతిమిలాడినా కనికరించలేదనిప్రిన్సిపాల్పై ఆగ్రహం
గణపురం, డిసెంబర్ 14 : తమ పిల్లలతో మాట్లాడనివ్వాలని తల్లిదండ్రులు శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే వసతి గృహం ఎదుట ఆందోళన చేపట్టారు. నిర్లక్ష్యపు సమాధానం చెప్పిన ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. రెండో శనివారం కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చూసేందుకు జ్యోతిబాఫూలే వసతి గృహానికి వచ్చారు. కానీ, ప్రిన్సిపాల్ స్వప్న, సిబ్బంది మా ట్లాడడానికి వారికి అనుమతి ఇవ్వలేదు. దీంతో తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ వద్దకు వెళ్లి బతిమిలాడినా కనికరించలేదు. దీంతో అసహనానికి గురైన తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉదయం 9 గంటలకే తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకున్నారు. ఇదే సమయంలో డైట్ ను ప్రారంభించేందుకు మంత్రులు అకడికి రావాల్సి ఉం ది. అయితే మంత్రుల కార్యక్రమం ఆలస్యం కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలతో మాట్లాడించాలని, మధ్యా హ్నం 1.30 గంటల సమయమవుతున్నదని, తాము ఉద యం 9 గంటలకు వచ్చామని ఉపాధ్యాయులతో మొరపెట్టుకున్నారు. అయినా, ఉపాధ్యాయులు వినకపోవడం, ప్రిన్సిపాల్ అకడికి చేరుకొని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో తల్లిదండ్రులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అకడే ఉన్న బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి శైలజ వి ద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వచ్చి సముదాయించి, విద్యార్థులతో మాట్లాడించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

