దంతాలపల్లి/నర్సింహులపేట, ఏప్రిల్ 14 : బీఆర్ఎస్ 25 ఏళ్ల పండుగను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి, నర్సింహులపేట మండల కేంద్రాల్లో కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయడంతో విఫలమైందన్నారు. ప్రభుత్వం ఇస్తామన్న రైతు భరోసా మూడు పంటలకు ఇప్పటికీ అందించలేదన్నారు. రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. పింఛన్ పెంచలేదని, తులం బంగారం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు.
ప్రభుత్వ పథకాలను అందించడంలో విఫలమైన కాంగ్రెస్ పరిస్థితిని ప్రజలకు వివరించి వచ్చే స్థానిక సంస్థల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పీఏసీఎస్‌లో వార్ వన్‌సైడ్ కావాలన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 25 ఏళ్ల పోరాటంలో 10 ఏళ్లు పాలనలో 120 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే జయంతి చేయకుండా తాళం వేశారని అన్నారు. ఏడాదిన్నరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్‌రెడ్డిని ప్రజలు చీదరించుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ 100 సీట్లు గెలుస్తదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ పరిపాలన చూస్తుంటే రెండు మూడురోజుల్లో సీఎం మార్పు తప్పదేమో అనిపిస్తుందన్నారు. అనంతరం సూర్యాపేట రోడ్డులో చలో వరంగల్‌కు సంబంధించిన వాల్ రైటింగ్ మాజీ ఎంపీ కవిత ప్రారంభించారు. బహిరంగ సభకు గ్రామానికి చెందిన అనిల్ 50కేజీల బియ్యం విరాళంగా అందజేశారు.