నర్సింహులపేట జూలై 8 : బీఆర్ఎస్ కార్యకర్తలే రెడ్యా నాయక్ పవర్ అని మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. మంగళవారం నరసింహుల పేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మండల విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతులకు పంట పంటకు రైతుబంధు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల అప్పుడు మాత్రమే రైతు భరోసా ఇస్తుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు 200 కోట్లతో రోడ్లు తీసుకువస్తే ఇప్పుడు పనులు చేస్తూ నేనే అభివృద్ధి పనులు చేస్తున్నానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క కార్యకర్త దగ్గర నుంచి పది రూపాయల లంచం తీసుకున్న రాజకీయ సన్యాసం తీసుకుంటారని తెలిపారు. ఐదేళ్లు పార్టీలో ఉండి పదవులు అనుభవించి, వేరే వారికి ఓటు వేయించిన వారికి అన్నం దొరకదని, పార్టీలు మారిన వారి సంగతి ప్రజలు చూసుకుంటారని తెలిపారు. ఎన్నికల కోసమే రైతు భరోసా వేస్తూ పది నిమిషాలకు ఒకసారి కరెంటు ట్రిప్ అవుతున్న పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి కనిపిస్తుందని ఎమ్మెల్యే 19 నెలల్లో ఏం పనులు మంజూరు చేశారని ప్రశ్నించారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టిన అభ్యర్థులను ఓడిస్తేనే హామీల అమలు అవుతాయన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మైదం దేవేందర్, మాజీ వైసీపీ జాటోత్ దేవేందర్, గుగులోతు రవి, కుంభం సువి వీరెడ్డి, నెలకొర్తి సత్తిరెడ్డి, బండ బిక్షం రెడ్డి, నర్సింహారెడ్డి, రమేష్, ఖాజ మియా, చంద్రారెడ్డి, కిషన్ నాయక్, వీరన్న, రామన్న, కాలు నాయక్, రమేష్ రెడ్డి ,వెంకన్న పాల్గొన్నారు.