భీమదేవరపల్లి, ఏప్రిల్ 23: ఆయిల్ ఫామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని ఆయిల్ ఫామ్ జిల్లా మేనేజర్ రంజిత్ అన్నారు. మండలంలోని ముస్తఫాపూర్ గ్రామంలో దొడ్డి విష్ణువర్ధన్ ఆయిల్ ఫామ్ పంట క్షేత్రంలో పరాగ సంపర్కానికి సంబంధించిన కీటకాలను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంట ప్రోత్సాహానికి ప్రభుత్వం రైతులకు కల్పిస్తున్న రాయితీని వినియోగించుకోవాలని కోరారు.
దీంతో పాటు ఉద్యాన శాఖ ద్వారా రైతులు 90% రాయితీ పొందవచ్చన్నారు. రైతులు ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు రావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులు కేఎన్ బయోసైన్సెస్ ఫీల్డ్ ఆఫీసర్లు విక్రమ్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Summer | రాష్ట్రంలో భానుడి భగభగలు.. 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు