Summer | హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): మొన్నటి వరకు వర్షాలతో కాస్త తెరిపినిచ్చిన భానుడు మళ్లీ నిప్పులు కురిపిస్తున్నాడు. మంగళవారం 33 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణలో రాబోయే నాలుగు రోజులపాటు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఉత్తర తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీచేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికను జారీచేసింది. 24,25 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ పాటు నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది. కాగా, మంగళవారం హైదరాబాద్‌తోపాటు కొన్ని జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసినట్టు వాతావారణ కేంద్రం వెల్లడించింది.