ములుగు, సెప్టెంబర్ 5 ( నమస్తే తెలంగాణ) : కేంద్ర విద్యాశాఖ ఆగస్టు 25న ప్రకటించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ములుగు జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కందాల రామయ్య ఎంపిక కాగా, సోమవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. రామయ్య ములుగు మండలం అబ్బాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.