ఖిలావరంగల్: రైల్వే ప్రైవేటీకరణ ఆపివేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ముక్కెర రామస్వామి అన్నారు. మంగళవారం సీఐటీయూ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైల్వేను ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ వరంగల్ రైల్వే స్టేషన్ ఎదుట నిరసన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ రైల్వేను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనను విరమించుకొని ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
రైల్వేలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. అలాగే పేద మధ్యతరగతి ప్రజలు ప్రయాణించే సాధారణ భోగీల సంఖ్య పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాగర్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ మహబూబ్ పాషా, యం రవీందర్, అశోక్, శ్రీశైలం, నరసయ్య, వెంకటేశ్వర్లు, రమేష్, రాజు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.