రామప్ప దేవాలయంతో పాటు చుట్టు పక్క న సుమా రు 18 ఉపాలయాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన ఆలయంతో పాటు ఫెన్సింగ్ ఏర్పాటుచేసిన లోపల ఆలయాలను కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్నాయి. యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత గొల్లగుడి, శివాలయం కేంద్ర పురావస్తు శాఖ స్వాధీనం చేసుకొం ది. మిగతా 8 ఆలయాలు రాష్ట్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉండగా వాటిని రక్షించడం లో అధికారులు, ప్రభుత్వాలు ఆలసత్వం ప్రదర్శిస్తున్నాయి. 2007 సంవత్సరంలో రామ ప్ప ప్రధాన ఆలయం గర్భగుడి తాళాలు పగులగొట్టి హుండీలను ఎత్తుకెళ్లారు.
ఆ తర్వాత రామ ప్ప ఆలయానికి పోలీస్ శాఖ నుంచి 10 ఏళ్ల పాటు 4 హోంగార్డులను కేంద్ర పురావస్తు శాఖకు కేటాయించి పగలు ఇద్దరు, రాత్రి ఇద్దరు కాపాలా కాసేవారు. ఆ తర్వాత హోంగార్డులను తొ లగించారు. హోంగార్డులను తొలగించిన తర్వాత కొన్ని రోజులు ప్రైవేట్ సెక్యూరిటీని పురావస్తు శాఖ నుంచి ఏ ర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం సెక్యూరిటీ సిబ్బంది కూడా రామప్పలో లేరు. గతంలోను ఉపాలయాల్లోని శివలింగాలను, దేవతామూర్తులను పెకిలించి, పునాదుల్లో నిధులు ఉంటాయని ధ్వంసం చేసిన సంఘటనలు అనేకం. రామప్ప చెరువు కట్టపై ఉన్న ఆలయం(కల్యాణ మండపం)లో 2010లో నంది విగ్రహం మెడను దుండగులు ధ్వంసం చేశారు.
నందికి ఆమడదూరంలో నిధి ఉందనే ప్రచారం, వజ్రాలు, బం గారం ఉంటుందని నంది మెడను పగులగొట్టారు. హరితహోటల్ పక్కన ఆలయాలతో పాటు గొల్లగుడి, శివాలయం, భైరవగుడి, వరహాల గుట్ట, ఆలయం చుట్టూ ఉన్న కోట కట్ట, నర్సరీ ఏరియాల్లో కొన్నేళ్ల క్రితం తవ్వకాలు చేపట్టి ఆరుదైన శిల్పాలను, దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
తాజాగా గొల్లగుడి పైకప్పులోని పువ్వు ఆకారం మధ్యభాగంలో వజ్రాలు ఉంటాయనే మూఢనమ్మకంతో దుండగులు కప్పు భాగాన్ని తొలగించి దానిని కింద పడేసి దానిని ఒకరాయిపై పెట్టి పువ్వు ఆకారం(కలశం లాంటి) మధ్య భాగాన్ని పూర్తిగా సుత్తితో పగులగొట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. రామప్ప గుడి ముందున్న గొల్లగుడి.. నివాసాలకు 100 మీటర్ల లోపే ఉంటుంది. ఇందులోనే దుండగులు ఇలా ధ్వంసం చేస్తే చెరువు కట్టపైన ఉన్న ఆలయాల పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రామప్ప ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలను పర్యాటకులు చూసేలా వినియోగంలోకి తీసుకురావడంతో పాటు రాత్రీపగలు కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖలు సిబ్బందిని, సెక్యూరిటీని నియమించాలని, సీసీ కెమెరాలు, లైటింగ్ ఏర్పాటు చేసి దుండగుల నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రామప్ప ఆలయంతో పాటు ఉపాలయాలకు సిబ్బందిని పెంచి ఆలయాలను రక్షించుకోవాలి. గతంలో రామప్పలో హుండీ దొంగతనం, చెరువు దగ్గర గుడిలోని నంది విగ్రహాలను ధ్వంసం చేయగా నాటి కలెక్టర్ స్పందించి హోంగార్డులను నియమించారు. వారు ప్రస్తుతం లేకపోవడంతో పురావస్తు శాఖ సిబ్బంది క్లీనింగ్‌తో పాటు సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తున్నారు. రామప్పలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఉపాలయానికి నలుగురు సిబ్బందిని ఏర్పాటు చేయాలి. యునెస్కో గుర్తింపు లభించిన కూడా ఆలయాలను రక్షణ లేకపోవడం శోచనీయం.
– ఆకిరెడ్డి వెంకట రామ్మోహన్రావు, రామప్ప పరిరక్షణ సమితి కన్వీనర్
రామప్ప ఆలయంతో పా టు ఉపాలయాలను ప్రభుత్వాలు, అధికారులు రక్షించి భావితరాలకు అందించాలి. దుండగులు ఆలయాలను ధ్వంసం చేయడంతో పాటు ఆకతాయిలు అత్బుతమైన కట్టడాలపైన పేర్లు చెక్కడం, ఇటుకలు రాళ్లను తొలగించడం చేస్తున్నారు. సీసీ కెమెరాలు, పోలిస్ సెక్యూరిటీని పెంచి కళకండాలను కాపాడాలి.
– బుషిగుంపుల రాజయ్య
అపురూప శిల్ప సంపదతో అందరి దృష్టిని ఆకర్షించి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయం.. దాని 18 ఉపాలయాలకు రక్షణ కరువైంది. యునెస్కోలో ఈ ఆలయానికి చోటు దక్కినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ, నిఘా కొరవడి దుండగుల చేతిలో ధ్వంసమై చారిత్రక ఆనవాళ్లు కోల్పోతున్నది.
గతంలో ప్రధాన ఆలయ గర్భగుడి తాళాలు పగులగొట్టి హుండీలను దొంగలు ఎత్తుకెళ్లగా, గుప్తనిధుల కోసం ఉపాలయాల్లోని శివలింగాలను, దేవతామూర్తులను పెకిలించడంతో పాటు బంగారం, వజ్రాలు ఉంటాయనే మూఢనమ్మకంతో చెరువు కట్టపై ఉన్న ఆలయంలోని నంది విగ్రహం మెడను ధ్వంసం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఆదివారం దుండుగుల దుశ్చర్యకు గొల్లగుడి పైకప్పును ధ్వంసమైన ఘటనతో ఆలయ పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. మూఢనమ్మకాల ముసుగులో ఆకతాయిలు చారిత్రక సంపదను నామరూపాల్లేకుండా చేస్తున్న తరుణంలో కేంద్ర పురావస్తు శాఖ అదనపు సిబ్బందిని, సెక్యూరిటీతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి ఆలయాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు, చరిత్రకారులు కోరుతున్నారు.
– వెంకటాపూర్, సెప్టెంబర్ 23
రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించిన అనంతరం రామప్ప ప్రధాన ఆలయానికి, ప్రసాద్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధు లు మంజూరు చేయగా, నాటి కేసీఆర్ సర్కారు రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలోని 5 ఉపాలయాల పునర్మిర్మాణానికి రూ.15కోట్లు మంజూరు చేసింది. రామ ప్ప చెరువు కట్టపై ఉన్న త్రికూటాలయంతో పాటు మ రో రెండు ఆలయాలు మరింత దెబ్బతినకుండా రూ. 50 లక్షలతో చెరువు వైపు ప్రొటెక్షన్ వాల్ నిర్మించి ఆలయం చుట్టూ మొరం పోసి చదును చేశారు.