వరంగల్ : ముస్లిముల పవిత్ర రంజాన్ పండుగను ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముస్లిం సోదరులు (Ramzan celebrations) భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ముస్లిం సోదరులు ఈద్గాల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరి కొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్( Eid Mubarak) తెలుపుకున్నారు. మసీదులు, ఈద్గాల వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వేల సంఖ్యలో పాల్గొన్నారు. నమాజు అనంతరం స్నేహితులు, బంధుమిత్రులు ఆలింగనాలు చేసుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
పెద్దమ్మ గడ్డ దర్గాలో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం మత పెద్దలు
పున్నేల్ లో మాజీ జడ్పీ కోఆప్షన్ మెంబర్ ఉస్మాన్ అలీకి రంజాన్ శుభాకాంక్షలు తెలుపున్న టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు
బొక్కలగడ్డ ఈద్గాలో ప్రార్థన చేస్తున్న ముస్లింలు