భీమదేవరపల్లి, జులై 30: సమాజ సేవలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరులో శ్రీనివాస ఫంక్షన్ హాలులో జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి హాజరై మాట్లాడారు. చిన్న స్థాయి నుండి నేను అంచెలంచెలుగా ఎదగడంలో జర్నలిస్టులు ఎంతగానో సహాయ సహకారాలు అందించారని వెల్లడించారు. మారుతున్న కాలానుగుణంగా వార్తల సేకరణ మారిందన్నారు. సోషల్ మీడియా వచ్చాక వార్తలు సేకరించడం జర్నలిస్టులకు కత్తి మీద సాముల మారిందని పేర్కొన్నారు.
ప్రెస్ క్లబ్ నిర్మాణానికి సహకరిస్తామన్నారు. సమాజ సేవలో నిష్పక్షపాతంగా వ్యవహరించే జర్నలిస్టుల త్యాగాలు గొప్పవని ప్రశంసించారు.అనంతరం జర్నలిస్టులకు శాలువాలు కప్పి మెమొంటోలు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు పైడిపల్లి పృథ్వీరాజ్, బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీరామోజు శ్రీనివాస్, నాయకులు గుర్రాల లక్ష్మారెడ్డి, దొంగల కొమురయ్య, మార్పాటి అశోక్ రెడ్డి, మ్యాకల రాజు, అంబీరు కవిత, దొంగల రాణా, బొజ్జపురి పృథ్వీ, అయిత సాయి, బండారి కర్ణాకర్, లక్కిరెడ్డి మల్లారెడ్డి, సిద్ధమల్ల రమేష్, సంపత్, వైకుంఠం, ఉదయ్, మహేష్, అనిల్, శ్రీనివాస్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.