రాకేశ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో యువకుడు, విద్యావంతుడు బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు.
- బీఆర్ఎస్ శ్రేణులు సమన్వయంతో వ్యవహరించాలి
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
పాలకుర్తి రూరల్/దేవరుప్పుల, మే 26: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో యువకుడు, విద్యావంతుడు బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తి, దేవరుప్పుల మండలాల్లోని బీఆర్ఎస్ కార్యాలయాల్లో వేర్వేరుగా నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు వీటిని నెరవేర్చలేదని విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో మళ్లీ నిరుద్యోగులను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ యత్నిస్తున్నాయని తెలిపారు. నిజాయితీపరుడు, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డిని పెద్దల సభకు పంపేందుకు పట్టభద్రులు ఓటేసి గెలిపించాలని ఎర్రబెల్లి కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
సీఎం కేసీఆర్ ఆశీస్సులు, పార్టీ నాయకుల అండతో రాకేశ్‌రెడ్డి గెలుపు ఖాయమైందన్నారు. పాలకుర్తిలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ మండల ఎన్నికల ఇన్చార్జి పల్లా సుందర్రామిరెడ్డి, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ చైర్మన్ బొబ్బల ఆశోక్‌రెడ్డి, మాజీ సర్పంచ్ వీరమనేని యాకాంతారావు, జర్పుల బాలునాయక్, మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, కమ్మగాని నాగన్న, కడుదుల కర్ణాకర్‌రెడ్డి, చిలుకమారి నాగేశ్వర్ పాల్గొన్నారు. దేవరుప్పులలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, ప్రధాన కార్యదర్శి చింత రవి, నాయకులు పల్లా సుందరరాంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ లింగాల రమేశ్‌రెడ్డి, వైస్ ఎం పీపీ కత్తుల విజయ్‌కుమార్‌రెడ్డి, నాయకులు ఈదునూరి నర్సింహారెడ్డి, బస్వ మల్లేశ్, కొల్లూరుసోమయ్య, ఏల సుందర్, జోగు సోమనర్సయ్య,ధరావత్ రాంసింగ్, కు తాటి నర్సింహులు, బిళ్ల యాదవరెడ్డి, అనంతోజు కృష్ణమూర్తి, ఆలకుంట్ల యాదగిరి, తిరుమలేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

