పరకాల/హనుమకొండ చౌరస్తా/కాజీపేట/దామెర, మే 24: పట్టభద్రుల ఎన్నికల్లో విద్యావంతుడైన బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల పట్టణ ఇన్చార్జి ఇంగిలి వీరేశ్‌రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు పరకాలలో శుక్రవారం పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. అలాగే, రాకేశ్‌రెడ్డి గెలుపు కోరుతూ సివిల్ సైప్లె కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం పార్టీ నేతలతో కలిసి హనుమకొండలో పటభద్రులను కలిసి రాకేశ్‌రెడ్డికి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. కాజీపేటలోని 62వ డివిజన్ సోమిడిలో ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపు కోరుతూ ఇన్చార్జి బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పట్టభద్రుల ఇంటికి వెళ్లి ప్రచారం చేశారు. కాంగ్రెస్ నాయకుల మోసపూరిత మాటలను నమ్మొద్దని కోరారు. దామెర మండలంలోని ల్యాదెళ్లలో బీఆర్ఎస్ నాయకుడు తాళ్లపల్లి శివ ఆధ్వర్యంలో కార్యకర్తలు ప్రచారం చేశారు.
కరీమాబాద్/గిర్మాజీపేట/ఖిలావరంగల్/చెన్నారావుపేట /నెక్కొండ/నల్లబెల్లి/వర్ధన్నపేట/హసన్‌పర్తి, మే 24 : రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి గెలిస్తేనే పట్టభద్రులకు న్యాయం జరుగుతుందని కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ హరిశంకర్ అన్నారు. శుక్రవారం కార్పొరేటర్ పల్లం పద్మ ఆధ్వర్యంలో ఎస్ఆర్ ఆర్తోటలో సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ను గెలిపిస్తేనే ప్రజల పక్షాన పోరాటం చేస్తారన్నారు. మాజీ కార్పొరేటర్ పల్లం రవి, డివిజన్ అధ్యక్షుడు పొగాకు సందీప్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అలాగే అండర్‌రైల్వేగేట్ ప్రాంతంలో కోరె కృష్ణ, కొంతం మోహన్ ప్రచారం చేశారు. గిర్మాజీపేటలో 29వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొడకండ్ల సదాంత్ ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. బీఆర్ఎస్ నాయకులు రాచర్ల రాము, తాళ్లపల్లి రమేశ్, పూజారి కుమారస్వామి, చందు, రాజు, రాజు పాల్గొన్నారు. ఖిలావరంగల్ 34వ డివిజన్ శివనగర్‌లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే 35వ డివిజన్లో కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, 36వ డివిజన్లో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, 37వ డివిజన్లో కార్పొరేటర్ సువర్ణ, 17వ డివిజన్లో కార్పొరేటర్ బాబు ఆధ్వర్యంలో పట్టభద్రులను కలిసి రాకేశ్‌రెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థించారు. చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో మండల నాయకులు బుర్రి తిరుపతి, తూటి శ్రీనివాస్, బోడ భద్దునాయక్, మహేందర్‌రెడ్డి, విజయరామరాజు, కుమారస్వామి, ప్రచారం చేశారు.
నెక్కొండలో సొసైటీ చైర్మన్ మారం రాము, న్యాయవాది రమేశ్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి తాటిపెల్లి శివకుమార్, శివకుమార్ ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నల్లబెల్లి మండలాధ్యక్షుడు సారంగపాణి ఆధ్వర్యంలో మండలంలోని మామిండ్లవీరయ్యపల్లె, మూడుచెక్కలపల్లె, గోవిందాపూర్, వేదనగర్ తదితర గ్రామాల్లో ప్రచారం చేశారు. ప్రచారంలో ప్యాక్స్ చైర్మన్ మురళీధర్‌రావు, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, నాయకులు ప్రవీణ్‌గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీదేవి పాల్గొన్నారు. వర్ధన్నపేట మండల కేంద్రంతో పాటుగా ఇల్లంద, నల్లబెల్లి, ల్యాబర్తి, దమ్మన్నపేట తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఓటర్ల ఇంటికెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ అప్పారావు, ఆయా గ్రామాల మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. హసన్‌పర్తిలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండి రజినీకుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని జయగిరి, అనంతసాగర్, మడిపల్లిలో ప్రచారం చేశారు. బీఆర్ఎస్ జిల్లా నాయకులు రఘు, గ్రామ అధ్యక్షుడు కుమారస్వామి, రంజిత్, పల్లె చంద్రకుమార్, రాజు, రంజిత్ సుధాకర్, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
రాయపర్తి : రాకేశ్‌రెడ్డి గెలుపుతోనే పట్టభద్రులకు న్యాయం చేకూరుతుందని వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసన మండలి ఎన్నికల పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి చెల్మెడ లక్ష్మీనర్సింహారావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల ఎన్నికల ఇన్చార్జి గుడిపూడి గోపాల్‌రావు, మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహానాయక్తో కలిసి మండలంలోని 39 గ్రామాలకు చెందిన పట్టభద్రులు, ఎన్నికల సమన్వయ కర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన పట్టభద్రులు బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికే తమ మొదటి ప్రాధాన్యతా ఓటును వేసి గెలిపించాల్సింగా అభ్యర్థించారు. అలాగే మండలంలోని మైలారంలో జడ్పీటీసీ రంగుకుమార్ సారథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటా ప్రచారం చేశారు. ఎంపీపీ అనిమిరెడ్డి, మండల నాయకులు సురేందర్‌రావు, మధు, నర్సయ్య, శ్రీనివాస్‌రెడ్డి, నయీం, అశ్రఫ్‌పాషా పాల్గొన్నారు.