వరంగల్ : రైతుబంధు ఘనత సీఎం కేసీఆర్‌దేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు. సంగెం మండల కేంద్రంలో రైతుబంధు సంబురాల్లో పాల్గొన్నారు. ఎడ్ల బండి ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన మండల స్థాయి ముగ్గులపోటీలను సందర్శించారు.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతువేదిక భవనంలో ఏర్పాటు చేసిన రైతుబంధు సంబురాల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. గత ఏడు సంవత్సరాలుగా ఎన్ని అవాంతరాలు వచ్చినా నిరంతరాయంగా కొనసాగిస్తున్న అద్భుతమైన పథకం రైతు బంధు అని అన్నారు.
రైతుబంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. రైతుల పట్ల సీఎం కేసీఆర్ తీసుకుంటున్న శ్రద్ధ అనిర్వచనీయమైనదని కొనియాడారు. ఆరుగాలం కష్టించి శ్రమించే రైతన్నకు అండదండగా ఉండాలనే గొప్ప ఉద్దేశంతో రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారని ప్రశంసించారు.
ప్రభుత్వానికి కరోనాతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధికారులు, ప్రజాప్రతినిధుల వేతనాలను సైతం నిలుపుదల చేసి రైతుబంధు ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు.
రైతులు కూడా ప్రభుత్వానికి సహకరించి ప్రత్యామ్నాయ పంటలను చేపట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు.
నిరువులేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ధాన్యం కొనాల్సింది కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం.
ధాన్యం కొనకుండా రైతులను భయాందోళనకు గురిచేస్తూ బిజెపి రాజకీయ లబ్ధికోసం కుటిల రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. రైతాంగం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం కృషిచేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.