హనుమకొండ, మే 5 : కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీకి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. ఈ నెల 7న రాష్ట్ర ఐటీ, పరిశ్రమ లు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సందర్శించనున్న హనుమకొండ నయీంనగర్‌లోని సాఫ్ట్ పాత్ ఐటీ ఆఫీస్ ను, వడ్డెపల్లిలోని పీజేఆర్ గార్డెన్స్‌ను గురువారం సాయం త్రం ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాసర్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, హనుమకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుతో కలిసి మంత్రి ఎర్రబెల్లి పరిశీలించారు. సాఫ్ట్ పాత్ ఐటీ కార్యాలయంలో పనుల వివరాలను తెలుసుకున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యూపీఏ పాలనలో దేశంలో 1,58,117 మంది రైతులు చనిపోయారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 18 వేల మంది రైతులు ప్రాణం తీసుకున్నారని గుర్తుచేశారు. అప్పటి పాలకుల రైతు వ్యతిరేక విధానాల వల్లే రైతులు అప్పులపాలై ఆత్మహత్య చే సుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు పేరుకే 7 గంటల కరంటు అని మూడు గంటలే ఇచ్చేవారని పేర్కొన్నారు. గతంలో కరంటు తీగలపై బట్టలు ఆరేసుకునే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు.
రాత్రి పూట కరంటు వల్ల పొలాల్లో పని చేసుకుంటూ పాముకాటుకు, కరంటు షాక్‌కు గురై చనిపోయారని ఆవేదన చెందారు. ని జామాబాద్లో జొన్న రైతులను కాల్చి చంపించింది కాం గ్రెస్ వాళ్లు కాదా? అని ప్రశ్నించారు. ఆంధ్ర, తెలంగాణల ను కలుపడం కూడా కాంగ్రెస్ తప్పిదమేనని చెప్పారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యతిరేక వైఖరి వల్ల 1969 ఉద్యమంలో 369 మంది అమరులయ్యారని, మలిదశ ఉద్యమంలో కూడా 1200 మంది బలిదానం చేసుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుండా నాన్చినందువల్లే ఇన్ని బలిదానాలు జరిగాయన్నారు. ఉమ్మడి పాలనలో ఎరువుల కొరత ఉండేదని, క్యూలైన్లలో నిలబడలేక చెప్పు లు వరుసలో పెట్టి వారి వంతు వచ్చినపుడు వెళ్లి తీసుకునే పరిస్థిలు ఉండేవని గుర్తుచేశారు.
సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ ఏడేళ్లలో వ్యవసాయంపై రూ.3.87లక్షలు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. 24 గంటల కరంటు, మిషన్ కాకతీయతో చెరువుల అభివృద్ధి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా చెరువులను నింపుకొంటున్నామని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా, రుణ మాఫీ, అందుబాటులో విత్తనా లు, ఎరువులు ఇలాంటి ఎన్నో రైతు అనుకూల విధానాలు ఇప్పుడు రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. రైతుల అనుకూల విధానాలతోనే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పూర్తిగా తగ్గాయని కేంద్రమే ప్రకటించిందని గుర్తుచేశారు. మంత్రి వెంట ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి, వరంగల్ కలెక్టర్ డాక్టర్ గోపి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు ఉన్నారు.