హనుమకొండ చౌరస్తా, జూన్ 25 : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకొని ఈనెల 27న హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్లో సిడీ ఆవిష్కరించనున్నట్లు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు పాములపర్తి రామారావు తెలిపారు. బుధవారం హనుమకొండ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకొని ఆయనపై ఉన్న ప్రేమ అభిమానంతో రాయించిన పాటను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్, విజయవాడ నుంచి ప్రముఖ గాయకులు పాల్గొని తమ పాటలతో ఉత్సాహపరుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.