రైతు సమస్యలు సర్కార్ దృష్టికి తీసుకెళ్లేందుకే..
రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంపుహౌస్‌ను సందర్శిస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. శనివారం ఆయన బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కన్నెపల్లిలో ఏర్పాట్లను పరిశీలించారు.
- మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
- కన్నెపల్లిలో కేటీఆర్ పర్యటన ఏర్పాట్లు పరిశీలన
మహదేవపూర్, జూలై 4 : రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంపుహౌస్‌ను సందర్శిస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. శనివారం ఆయన బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కన్నెపల్లిలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు పిల్లర్లు దెబ్బతిన్నాయన్న సాకుతో రెండేళ్లుగా మేడిగడ్డ బరాజ్‌లో నీటిని నిల్వ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రతిరోజు ఒక టీఎంసీ నీరు వృథాగా పోతున్నదని, సీఎం, స్థానిక ఎమ్మెల్యే ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఆయన విమర్శించారు.
రెండేళ్లుగా ప్రాజెక్టుల్లో నీరు నిల్వ చేయకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులు ఇబ్బందులు ఎదురొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని మధు పిలుపునిచ్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్‌రావు, మండల యూత్ మాజీ అధ్యక్షుడు ఎండీ అలీంఖాన్, నాయకులు అన్కారీ ప్రకాశ్, తడకల రమేశ్, ఆరుట్ల పవన్, లేతకరి ఆనంద్, నిట్టూరి సాయి, శ్యామ్, మహేందర్, రాకేశ్, సతీశ్, సాయి, చకినారపు శశి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

