హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతిని హనుమకొండలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ ఖుస్రుపాషా, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎరబెల్లి స్వర్ణ, కలెక్టర్ ప్రావీణ్య, మున్సిపల్ కమిషనర్ తానాజి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్రావు, కార్పొరేటర్లు మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, టీజీవో కోఆర్డినేటర్ అన్నమనేని జగన్మోన్రావు, నేతలు డాక్టర్ చందుపట్ల ప్రవీణ్‌కుమార్, దనసరి మురళీధర్‌రెడ్డి, ఫణికుమార్, టీఎన్జీవోస్ నాయకులు కోలా రాజేష్‌కుమార్‌గౌడ్, సురేష్‌కుమార్, మాధవరెడ్డి, 5వ డివిజన్ ప్రెసిడెంట్ బొల్లపల్లి పున్నంచందర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
హనుమకొండలోని జిల్లా గ్రంథాలయంలో ఛైర్మన్ మహమ్మద్ అజిజ్ఖాన్ అంబేద్కర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బిన్ని లక్ష్మణ్, కందుల సృజన్కాంత్, సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు అక్రమ్, రమేశ్, గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు. అలాగే 5వ డివిజన్ అధ్యక్షుడు బొల్లపల్లి పున్నంచందర్ ఆధ్వర్యంలో కొత్తూరుజెండా పోచమ్మ దేవాలయం దగ్గర అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పండుగ సాగర్, దాసరి సమ్మయ్య, బొల్లపల్లి చంద్రశేఖర్, రమేశ్‌నాయక్, మహేశ్, విశాల్, వెంకన్న, లక్ష్మీనారాయణ, ప్రభాకర్, రవి, మూలదాస్, శ్రీమన్నారాయణ, సంపత్, సుధాకర్, రాము, భార్గవ్ పాల్గొన్నారు.