అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మంగళవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరూరా వేడుకలు నిర్వహించి కేక్‌లు కట్ చేశారు. మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. జిల్లాలో సంబురాలు అంబరాన్నంటాయి.
కరీమాబాద్/ఖిలావరంగల్/మట్టెవాడ/కాశీబుగ్గ, మార్చి 8: వరంగల్ నగరంలోని అన్ని డివిజన్లలో మంగళవారం మహిళా దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. 32, 33, 39, 40, 41, 42, 43వ డివిజన్లలో కార్పొరేటర్లు పల్లం పద్మ, ముష్కమల్ల అరుణ, సిద్దం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ, గుండు చందన, ఈదురు అరుణ ఆధ్వర్యంలో మహిళలను సత్కరించారు. 42వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ కేడల పద్మ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. శంభునిపేటలోని విశ్వనాథకాలనీలో అధ్యక్షుడు కర్నె రవీందర్ ఆధ్వర్యంలో ఎస్సై మద్దెల స్వాతిని సత్కరించారు. అంబేద్కర్‌నగర్‌లో రమాబాయి అంబేద్కర్ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు తరాల రాజమణి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. మామునూరులోని కృషి విజ్ఞానకేంద్రంలో నిర్వహించిన వేడుకలకు రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ సరళ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా రైతులను సత్కరించారు. కృషి విజ్ఞాన కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. ఫోర్టురోడ్డులోని ఏఎస్ఎం కళాశాలలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఉర్సు బైపాస్‌రోడ్డులోని తాళ్ల పద్మావతి కళాశాలలో చైర్మన్ తాళ్ల మల్లేశం ఆధ్వర్యంలో మహిళలను సత్కరించారు. వరంగల్ 37వ డివిజన్లో నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన మహిళలకు కార్పొరేటర్ బోగి సువర్ణా సురేశ్, మాజీ కార్పొరేటర్ బిల్లా కవితా శ్రీకాంత్ బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు విజయ్, రమాదేవి, లావణ్య, కవిత, శోభ, రాధిక, స్వర్ణ, వందన, చందర్, వాసుదేవ్, మురళి పాల్గొన్నారు. వరంగల్ రామన్నపేటలోని సుశీల్ గార్డెన్స్‌లో నిర్వహించిన వేడుకల్లో మహిళా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మహిళా నేతలు, వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలు పాల్గొన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మహిళా ప్రముఖులను సన్మానించారు.
మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో మహిళా సిబ్బంది కోసం కేటాయించిన ప్రత్యేక గదిని వరంగల్ ఏసీపీ గిరికుమార్ కలకోట ప్రారంభించారు. మట్టెవాడ ఇన్స్పెక్టర్ సీహెచ్ రమేశ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. 29వ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు మేయర్ గుండు సుధారాణికి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ శ్రేణులు కొడకండ్ల సరిత, రామగిరి నిర్గుణ, అర్షం వనిత, మల్లేశ్వరి, రమ్య, ప్రవళిక, బంక మౌనిక, ధనలక్ష్మి, కొడకండ్ల సదాంత్ పాల్గొన్నారు. వరంగల్ 18వ డివిజన్లో మహిళలను సత్కరించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టారు. అంగన్వాడీ సిబ్బంది, ఆశ వర్కర్లు, ఆర్పీలు, కార్పొరేటర్ వస్కుల బాబు, మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్, టీఆర్ఎస్ నాయకులు యాసిన్, తాళ్ల ఉమాదేవి పాల్గొన్నారు. 14వ డివిజన్ ఎంపీపీఎస్‌లో పిల్లలకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. హెచ్ఎం నాగేందర్ బహుమతులు ప్రదానం చేశారు. టీచర్లు యాకూబ్‌ఖాన్, నాగేశ్వర్రావు, శ్రీను పాల్గొన్నారు. అలాగే, నగరంలోని వ్యవసాయ కళాశాలలో మహిళా రక్షక విభాగం, ఎన్ఎస్ఎస్ సంయుక్తంగా డాక్టర్ బలరాం అసోసియేట్ డీన్ అధ్యక్షతన మహిళా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా యూనియన్ బ్యాంక్ రిటైర్డ్ జోనల్ మేనేజర్ నెల్లుట్ల రమాదేవి హాజరై చిత్రలేఖనంలో గెలుపొందిన వారికి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించారు. ఆరెపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఫాస్పెట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మహిళలకు చీరెలు, గాజులు, బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సహ వ్యవసాయ సంచాలకులు డాక్టర్ ఉమారెడ్డి, కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫరూక్ హుస్సేన్, అసిస్టెంట్ కంప్ట్రోలర్ జయశ్రీ, డాక్టర్ పద్మజా, శంకుతల, నీలిమా పాల్గొన్నారు.
వరంగల్‌చౌరస్తా/పోచమ్మమైదాన్: కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా వీసీ డాక్టర్ బీ కరుణాకర్‌రెడ్డి హాజరై కేక్ కట్ చేసి మహిళా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. హెల్త్ యూనివర్సిటీలో సుమారు 60 శాతానికి పైగా మహిళా ఉద్యోగులు ఉన్నారని ఆయన గుర్తుచేశారు. ప్రజారోగ్య, వైద్య ఉద్యోగుల సంఘం ఎంజీఎం బ్రాంచ్ అధ్యక్షురాలు ప్రేమలత ఆధ్వర్యంలో ఎంజీఎం స్టాఫ్‌నర్సులు వేడుకలు నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకుడు రాజనాల శ్రీహరి ఆధ్వర్యంలో యాచక మహిళలకు శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు అందజేశారు.
వరంగల్ 12వ డివిజన్లో కార్పొరేటర్ కావటి కవితా రాజుయాదవ్ ఆధ్వర్యంలో క్రీడా, సాంస్కృతిక పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు పంపిణీ చేశారు. 13వ డివిజన్ ఉర్దూ షాదీఖానా భవనంలో కార్పొరేటర్ కేక్ కట్ చేశారు. 21వ డివిజన్లో కార్పొరేటర్ ఎండీ ఫుర్కాన్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. 22వ డివిజన్లో టీఆర్ఎస్ నాయకురాలు మావురపు గీతా విజయభాస్కర్‌రెడ్డి కేక్‌కట్ చేసి మహిళలను సన్మానించారు. 23వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతీ సత్యనారాయణ ఆధ్వర్యంలో మహిళలను సత్కరించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ పోతన లీడర్షిప్ చైర్మన్ డాక్టర్ ఆడెపు రవీందర్ ఆధ్వర్యంలో శాంతినగర్‌లో నిర్వహించిన ఆటలపోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీకేఎం కాలేజీలో అధ్యక్షుడు చింతం సారంగపాణి ఆధ్వర్యంలో మహిళా వాకర్స్‌ను సన్మానించారు. దేశాయిపేటలోని ప్రభుత్వ పాఠశాలలో స్వర్ణభారతి యూత్ వెల్ఫేర్ సొసైటీ, ఎఫ్ఎంఎం సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో, అర్బన్ హెల్త్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తంగళ్లపల్లి భరత్‌కుమార్, పోచమ్మమైదాన్‌లో ఆల్ ఇండియా హూమన్ రైట్స్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారిణి రహమున్నీసాబేగంను సన్మానించారు.
ఖానాపురం/చెన్నారావుపేట/నర్సంపేటరూరల్/గీసుగొండ: స్త్రీలు లింగ సమానత్వాన్ని సాధించాలని జన విజ్ఞాన వేదిక జిల్లా కన్వీనర్ మాధవిరెడ్డి అన్నారు. ఖానాపురం మండలం అశోక్‌నగర్ కేజీబీవీలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్త్రీ స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వో మేనక అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాధవిరెడ్డి మాట్లాడుతూ మహిళలు విద్యతోనే సమానత్వం సాధిస్తారన్నారు. ఎస్సై తిరుపతి మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. అనంతరం కేజీబీవీ బాలికలను సన్మానించారు. చెన్నారావుపేటలోని సిద్ధార్థ గురుకుల హైస్కూల్లో చైర్మన్ కంది గోపాల్‌రెడ్డి-విజయ దంపతులు కేక్ కట్ చేసి మహిళా ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో హెచ్ఎం అండెం కరుణాకర్‌రెడ్డి, ఉపాధ్యాయులు ముదురు పద్మ, సృజన, రోజారాణి, శైలజా, బొజ్జ స్వప్న, తొగరు రమాదేవి, కుండె రోజా, గొట్టె స్వప్న, కొమురవెళ్లి మౌనిక, గీత, సుకన్య పాల్గొన్నారు. అలాగే, మండలకేంద్రానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు ఎండీ రఫీ, కంది కృష్ణచైతన్యారెడ్డి, కందకట్ల సాంబయ్య నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్నకు పుష్పగుచ్ఛం అందించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నర్సంపేట మండలం పాతముగ్ధుంపురంలో జాగృతి విద్యానికేతన్ స్కూల్లో సర్పంచ్ సుంకరి లావణ్యను కరస్పాండెంట్ ఈగ సత్యనారాయణ, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. గుంటూరుపల్లిలో సర్పంచ్ కర్నాటి పార్వతమ్మ, ఏనుగల్తండాలో సర్పంచ్ స్వాతిని వార్డుసభ్యులు, గ్రామపెద్దలు సత్కరించారు. జీపీ కార్యాలయాల్లో కేక్‌లు కట్ చేశారు. మహిళా ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. లక్నేపల్లి శివారులోని బాలాజీ టెక్నో స్కూల్లో మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో బిట్స్ చైర్మన్ డాక్టర్ అండృ రాజేంద్రప్రసాద్‌రెడ్డి, ప్రిన్సిపాల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బాలాజీ విద్యా సంస్థల్లో విద్యార్థులు సాంప్రదాయ వస్ర్తాధారణ, నృత్యాలు, డప్పుచప్పుళ్ల ప్రదర్శనలు ఇచ్చారు. జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న, నర్సంపేట మున్సిపల్ చైర్మన్ గుంటి రజిని పాల్గొని విద్యార్థినులతో కలిసి డ్యాన్స్ చేశారు. గీసుగొండ మండలంలోని మరియపురంలో సర్పంచ్ బాలిరెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీల పోటీలు నిర్వహించారు. ప్రగతి మండల సమాఖ్య కార్యాలయంలో కేక్ కట్ చేసి మహిళలను సన్మానించారు. ఎంపీపీ సౌజన్య, ఏపీఎం సురేశ్‌కుమార్, సీసీలు శోభారాణి, అశోక్ పాల్గొన్నారు.
నెక్కొండ/సంగెం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెక్కొండలో ఐఎంఏ ఉమెన్ వింగ్ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న ప్రారంభించారు. ఐఎంఏ నర్సంపేట వింగ్ వైద్యులు ఇజ్వల, భారతి, సుజాత, హిమబిందు, వాసవీ, సీతల్, మౌనిక పాల్గొని 300 మంది మహిళలకు వైద్య పరీక్షలు చేశారు. అలాగే, నెక్కొండలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఎంపీపీ రమేశ్, సొసైటీ చైర్మన్ మారం రాము, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రజిత, రుక్మిణి, అనిత పాల్గొన్నారు. సర్పంచ్ సొంటిరెడ్డి యమున ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులను సన్మానించారు. ఎస్సై సీమ ఫర్హీన్, వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, సీఏలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. సంగెంలో శాంతి మండల సమాఖ్య అధ్యక్షురాలు కల్యాణి అధ్యక్షతన వేడుకలు నిర్వహించారు. ఎంపీపీ కందకట్ల కళావతి మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు రుణాలు తీసుకొని ఆర్థికంగా బలపడాలన్నారు. పీహెచ్సీలో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలను యువసంకల్ప స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సత్కరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, తాసిల్దార్ రాజేంద్రనాద్, ఎంపీడీవో మల్లేశ్ం, సర్పంచ్ గుండేటి బాబు తదితరులు పాల్గొన్నారు.