వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలి
సామాన్యుల నడి విరిసేలా పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి డిమాండ్ చేశారు. గ్యాస్ ధర పెంపును వ్యతిరేకిస్తూ వరంగల్ ప్రధాన తపాలా కార్యాలయం సెంటర్లో గురువారం భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడిచిన నాలుగు నెలల్లో మోదీ సర్కారు నాలుగు సార్లు గ్యాస్ ధర పెంచడంతో పేదల ఆర్థిక వ్యవస్థపై
పేదల జీవితాలతో కేంద్రం చెలగాటం
సబ్సిడీ ఎత్తేసి పేదోళ్ల నడ్డి విరిచింది
భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం
వరంగల్ ప్రధాన తపాలా కార్యాలయం సెంటర్లో ధర్నా
వరంగల్‌చౌరస్తా, జూలై 7: సామాన్యుల నడి విరిసేలా పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి డిమాండ్ చేశారు. గ్యాస్ ధర పెంపును వ్యతిరేకిస్తూ వరంగల్ ప్రధాన తపాలా కార్యాలయం సెంటర్లో గురువారం భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడిచిన నాలుగు నెలల్లో మోదీ సర్కారు నాలుగు సార్లు గ్యాస్ ధర పెంచడంతో పేదల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. మోదీ సర్కారు అధికారంలోకి రాకముందు రూ. 450 ఉన్న గ్యాస్ ధర నేడు రూ. 1100లకు పెంచి పేదల జీవితాలతో చెలగాటం ఆడుతున్నదని ధ్వజమెత్తారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్రం పెంచుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలను తగ్గించకపోతే బీజేపీ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు తాళ్లపల్లి రహేలా, సౌందర్య, భవాని, సువర్ణ, ప్రమీల, పద్మ, విజయలక్ష్మి, రజిత, వాణి, రేవతి, రజిత, స్వప్న పాల్గొన్నారు.
గ్యాస్ ధరను తగ్గించాలి : సీపీఐ
నెక్కొండ: తక్షణమే వంట గ్యాస్ ధర తగ్గించాలని సీపీఐ మండల కార్యదర్శి కందిక చెన్నకేశవులు మోదీ సర్కారును డిమాండ్ చేశారు. సబ్సిడీ తగ్గిస్తూ గ్యాస్ ధరను పెంచుతూ కేంద్రం సామాన్యులను ఆగం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ధర తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో మహిళలు డిప్యూటీ తాసిల్దార్ రాజ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు మేరుగు మల్లయ్య, బం డారి నర్సయ్య, కందిక అశోక్, శ్యామ్, గుర్రాల మమత, కనుకుల సరిత, దేవపాల, మమత, అనంతగిరి రేణుక, బిర్రు సమ్మక్క పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బాలికపై రోబో లైంగిక వేధింపులు!
యూత్ కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్లోకి దుడ్డు ఆకాశ్
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

