అంబులెన్స్‌లో అటూ.. ఇటూ!
కాకతీయ మెడికల్ కళాశాలలోని సూపర్ స్పెషాలిటీతోపాటు ఎంజీఎం ఆస్ప్రతి రోగులు అంబులెన్స్‌లో అష్టకష్టాలు పడుతున్నారు. సూపర్ స్పెషాలిటీ దవాఖానలో అత్యవసర విభాగం లేకపోవడంతో ఎంజీఎంహెచ్ క్యాజువాలిటీలో చేర్పించి మరుసటి రోజు తిరిగి అంబులెన్స్‌లో తరలించి, ఆయా వార్డుల్లో అడ్మిట్ చేస్తున్నారు.
- సామర్థ్యానికి మించి తరలిస్తున్న సిబ్బంది
- సూపర్ స్పెషాలిటీ, ఎంజీఎంహెచ్ రోగుల అవస్థలు
- పట్టించుకోని వైద్యాధికారులు
వరంగల్ చౌరస్తా, జూన్ 13 : కాకతీయ మెడికల్ కళాశాలలోని సూపర్ స్పెషాలిటీతోపాటు ఎంజీఎం ఆస్ప్రతి రోగులు అంబులెన్స్‌లో అష్టకష్టాలు పడుతున్నారు. సూపర్ స్పెషాలిటీ దవాఖానలో అత్యవసర విభాగం లేకపోవడంతో ఎంజీఎంహెచ్ క్యాజువాలిటీలో చేర్పించి మరుసటి రోజు తిరిగి అంబులెన్స్‌లో తరలించి, ఆయా వార్డుల్లో అడ్మిట్ చేస్తున్నారు. అలాగే ఎంజీఎంహెచ్‌లో అందుబాటులో లేని యంత్ర పరికరాల ద్వారా నిర్వహించాల్సిన పరీక్షల కోసం రోగులు, క్షతగాత్రులను అంబులెన్స్‌లో సూపర్ స్పెషాలిటీకి తరలిస్తున్నారు.

వీరిలో 2డీ ఈకో, డయాలసిస్, ఆర్ధోకు సంబంధించి స్కానోగ్రఫీ పరీక్షల రోగులే ఎక్కువగా ఉంటున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. అంబులెన్స్‌లో సామర్థ్యానికి మించి తీసుకెళ్తుండడంతో రోగులు, క్షతగాత్రులు ఇబ్బందులు పడుతున్నారు. అప్పటికే విరిగిన ఎముకలకు కట్లు కట్టుకొని అంత మందితో అటూ, ఇటూ పరీక్షల కోసం ప్రయాణించడం కష్టంగా ఉందని, నొప్పులను భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పరీక్షలు కావడంతో ముందుగా పూర్తి చేసుకున్న వారు ఇతరుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తున్నదంటున్నారు. తీరా ఆస్పత్రికి వెళ్లే సరికి వైద్యులు అందుబాటులో ఉండడం లేదని, దీంతో వైద్య సేవలు అందడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ఎంజీఎంహెచ్‌లో అవసరమైన యంత్ర, పరికరాను, సూపర్ స్పెషాలిటీలో అత్యవసర విభాగాన్ని ఏర్పాటు చేయాలని రోగులు, క్షతగాత్రులు కోరుతున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

