జనగామ : జనగామ సబ్ జైల్లో ఓ ఖైదీ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగారాజుపల్లికి చెందిన వరాల మల్లేష్(35) అటెంప్ట్ మర్డర్ కేసులో జనగామ సబ్ జైల్లో శిక్ష అనుభివిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి మల్లేష్ బ్లీచింగ్ పౌడర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన అధికారులు ఖైదీని
అర్ధరాత్రి వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించారు. కాగా, ఎంజీఎంలో చికిత్స పొందుతూ మల్లేష్ మృతి చెందాడు. మృతుడి బంధువులు ధర్నా జనగామ సబ్ జైలు ఎదుట ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.