హనుమకొండ, అక్టోబర్ 22 : కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కేంద్రంలో ప్రీ పీహెచ్డీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 187 మంది అభ్యర్థులలో 180 మంది హాజరయ్యారని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు.
ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రాన్ని సందర్శించినవారిలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.మనోహర్, ప్రొఫెసర్ ఎస్.నరసింహాచారి, పరీక్షల అదనపు కంట్రోలర్ పి.శ్రీనివాస, మమత ఇతరులు ఉన్నారు.