గీసుగొండ, ఫిబ్రవరి 04: సర్పంచులకు కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల5న తేదీన సెక్రటేరియట్ ముట్టడికి సర్పంచ్ల సంఘం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచులను (Former BRS sarpanches) మంగళవారం వరంగల్ జిల్లా గీసుకొండ(Geesugonda) పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అర్ధరాత్రి పోలీసులు ఇంటికి వెళ్లి విశ్వనాధపురం సర్పంచ్ అంకతి నాగేశ్వరరావు, మచ్చాపురం సర్పంచ్ బోడకుంట్ల ప్రకాష్, మనుగొండ సర్పంచ్ రామరాజు, కొమ్మాల సర్పంచ్ విరాటి కవితా రవీందర్ రెడ్డిలను అరెస్టు చేశారు.
వారిని మధ్యాహ్నం తరువాత సొంత పూచికత్తులపై విడుదల చేసినట్లు వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ బిల్లు చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అరెస్టులతో తమని ఆపలేరని, ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Nagarkurnool | ఇండ్లను కూల్చేందుకు సిద్ధమైన అధికారులు.. చారకొండలో తీవ్ర ఉద్రిక్తత : వీడియో
Dil raju | ఐటీ అధికారులతో ముగిసిన దిల్ రాజు విచారణ
Siddipet | కూడవెళ్లి వాగులోకి కాళేశ్వరం జలాలు.. ఆనందంలో రైతులు