నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్ జిల్లా చారకొండలో(Charakonda) ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జడ్చర్ల-కోదాడ 167 వ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా బైపాస్ రోడ్డు(Bypass road) కోసం చారకొండలో 29 ఇండ్లను కూలగొట్టడానికి అధికారులు సిద్ధమయ్యారు. అధికారులు పోలీసు బలగాలు, జేసీబీలతో చేరుకోవడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. బైపాస్ రోడ్డు కోసం మా ఇండ్లు కూలగొట్టొద్దు అని బాధిత కుటుంబాలు నిరసన వ్యక్తం చేశాయి. కండ్లముందే తమ ఇల్లు కూల్చివేస్తుండడంతో వృద్ధ దంపతులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఓ వృద్ధురాలు సోమసిల్లి పడిపోయింది. చిన్న పాపను సైతం పోలీసు వాహనాల్లో తరలిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చారకొండలో కళ్ళముందే తమ ఇల్లు కూల్చివేస్తుండడంతో కన్నీరు మున్నీరుగా విలపించిన వృద్ధ దంపతులు
సోమసిల్లి పడిపోయిన వృద్ధురాలు
108 లో ఆసుపత్రికి తరలించిన వైద్య సిబ్బంది https://t.co/0US8ITZ2Wm pic.twitter.com/bnzH5WK7bD
— Telugu Scribe (@TeluguScribe) February 4, 2025