కాజీపేట, జూన్ 10 : సమాజంలోని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కృషి చేయాలని పర్యావరణ పరిరక్షకుడు దేశం కోసం ప్రకాష్ సూచించారు. కాజీపేట పట్టణం సోమిడి పరిసర ప్రాంతంలో పట్టణానికి చెందిన యువకులతో కలిసి మంగళవారం కోటి విత్తనాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యా వరణ లక్ష్యంగా పద్మశ్రీ వనజీవి రామయ్య స్ఫూర్తితో గత కొంతకాలంగా కోటి విత్తనాల సేకరణ కార్యక్రమాన్ని ఎండ సైతం లెక్కచేయకుండా యువత కానుగ విత్తనాల సేకరణలో పాల్గొనడం అభినంద నీయమన్నారు. కోటి విత్తనాల కార్యక్రమంలో సేకరించిన విత్తనాలను వర్షాకాలంలో గుట్టలు మైదాన ప్రాంతాలు ప్రభుత్వ భూములు చల్లుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్తీక్, సుశాంత్, విష్ణు, త్రిదేవి, శ్రావణ్ కుమార్, జంపయ్య, చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.