వివిధ ప్రాంతాల్లో నవరాత్రులు పూజలందుకున్న వినాయక విగ్రహాలను డప్పుచప్పుళ్లు, భాజా భజంత్రీలు, కోలాటాలు, నృత్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి దేశాయిపేటలోని చిన్నవడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేస్తారు. ఊరేగింపు సాఫీగా సాగాలంటే రోడ్డు మార్గం గుంతలు లేకుండా అనువుగా ఉండాలి. కానీ, పోచమ్మమైదాన్ జంక్షన్ వద్ద రోడ్డు మార్గం అస్తవ్యస్తంగా తయారైంది.
రెండు నెలల క్రితమే పైపులైన్ లీకేజీ వల్ల పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టినా ఫలితం లేకపోయింది. కార్పొరేషన్ అధికారులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కాంట్రాక్టర్కు లాభం చేకూర్చారే తప్ప ప్రజల బాధలు తీరలేదని వాహనదారులు వాపోతున్నారు. ఈ రోడ్డుపై ఎలా ప్రయాణం ఎలా చేయాలంటూ మండపా ల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
– పోచమ్మమైదాన్/వరంగల్ ఫొటోగ్రాఫర్