హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 19 : కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ప్రతియేటా జాబ్ క్యాలెండర్(Job calendar )విడుదల చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంపై నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నా తెలంగాణ నిరుద్యోగ యువత గుర్తుచేస్తుంది, జాబ్ క్యాలెండర్ ఎక్కడ అని..! తెలంగాణ జాబ్ క్యాలెండర్..? బార్ కోడ్‌తో ఉన్న పోస్టర్లు కాకతీయ యూనివర్సిటీలో వెలిశాయి.
జాబ్ క్యాలెండర్‌పై క్యూఆర్ కోడ్‌తో కాకతీయ యూనివర్సిటీలో నిరుద్యోగులు పోస్టర్లు అంటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగులు పోస్టర్ల ద్వారా గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.