రాయపర్తి : రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొంతుతూ మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం దావఖానలోని మార్చురీలో భద్రపరిచినట్లు ఎస్ఐ కొంగ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17న మండలంలోని శివరామపురం (ఆర్ అండ్ ఆర్ కాలనీ) వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ గుర్తు తెలియని వ్యక్తి (యాచకుడిగా భావిస్తున్నారు) తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు క్షతగాత్రుడిని ఎంజీఎం దావాఖానకు తరలించి చికిత్స చేయిస్తున్నట్లు చెప్పారు. బుధవారం రాత్రి సదరు వ్యక్తి తీవ్ర అస్వస్థకు గురై మృతి చెందినట్లు వివరించారు. మృతుడి వయస్సు 40-50 ఏళ్ళు ఉంటాయని, చామన ఛాయ కలర్లో ఉన్నట్లు వివరించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వ్యక్తులు 8712685216, 8712685042 నెంబర్లకు సమాచారం అందజేయాల్సిందిగా ఆయన కోరారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది రవీందర్, తూళ్ల సంపత్ కుమార్, బానోత్ సుమన్ నాయక్, అనిల్ కుమార్, తడక అశోక్, మహ్మద్ రఫీ తదితరులు ఉన్నారు.