సుబేదారి, జూన్13 : వరంగ ల్ తూర్పు నియోజకవర్గంలో పోలీసు అధికారులు మరోసారి హద్దు దాటి వ్యవహరించారు. ఎలాంటి ప్రొటోకాల్ లేని వ్యక్తికి ఎస్కార్ట్‌గా వెళ్లి ఆ శాఖ పరువు తీశారు. మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళీధర్‌రావు శుక్రవారం వరంగల్ తూర్పు నియోజకవర్గం 34, 39వ డివిజన్లలోని శాంతినగర్, లక్ష్మీనగ ర్, జన్మభూమి జంక్షన్లో సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్, మిల్స్‌కాలనీ, ఇంతేజార్గంజ్, మట్టెవాడ ఇన్స్పెక్టర్లు బొల్లం రమేశ్, షుకూర్, తుమ్మ గోపిరెడ్డి, వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎస్సైలు విధులకు డుమ్మా కొట్టి కొండా మురళి వాహనానికి రోజంతా ఎస్కార్ట్‌గా వెళ్లారు. దీంతో ఆయా పోలీసు స్టేషన్లకు వచ్చిన బాధితులు ఇబ్బందులు పడ్డారు. గతంలోనూ కొండా మురళి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కూడా ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఎస్కార్ట్‌గా వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా తూర్పు పోలీసు అధికారులు ప్రవర్తించిన తీరు సైతం విమర్శలకు దారి తీసింది.