చెన్నై: టీ20 వరల్డ్‌కప్(T20 World Cup)లో ఇవాళ కెనడాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కివీస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ అర్థ శతకాలు బాదారు. చెన్నైలో జరిగిన గ్రూప్ డీ మ్యాచ్‌లో తొలుత కెనడా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. భారతీయ సంతతికి చెందిన కెనడా బ్యాటర్ యువరాజ్ సమ్రా తన బ్యాటింగ్‌తో హోరెత్తించాడు. 65 బంతుల్లోనే 110 రన్స్ స్కోరు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 బౌండరీలు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. యువరాజ్ సమ్రా దూకుడు వల్ కెనడా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 రన్స్ చేసింది. సమ్రా, బజ్వా మధ్య తొలి వికెట్‌కు 116 పరుగులు భాగస్వామ్యం ఏర్పడింది.
భారీ టార్గెట్‌ను న్యూజిలాండ్ ఈజీగా ఛేజ్ చేసింది. కేవలం 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకున్నది. రవీంద్ర 39 బంతుల్లో 59 రన్స్, ఫిలిప్స్ 36 బంతుల్లో 77 రన్స్ చేశారు. మూడో వికెట్‌కు అజేయంగా ఆ ఇద్దరూ 146 రన్స్ జోడించారు. ఈ గెలుపుతో కివీస్ వరల్డ్‌కప్ సూపర్ 8 స్టేజ్‌లోకి వెళ్లిపోయింది.
New Zealand seal their #T20WorldCup Super 8 spot with a comfortable win against Canada in Chennai 👏
📝: https://t.co/meUw66ZU1j pic.twitter.com/xBKjYSNwaR
— ICC (@ICC) February 17, 2026