కురవి, ఫిబ్రవరి 17 : తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో కేసీఆర్(KCR) స్థానం ఎవరు చెరిపివేయలేరని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ జన్మదిన వేడుకలను మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఘనంగా నిర్వహించారు. తొలుత భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో కేసీఆర్ గోత్రనామాలపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపల భారీ కేకును కట్ చేసి కార్యకర్తలు, నాయకులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. తదనంతరం కేసీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడికి మరింత ఆయుష్షు ప్రసాదించా లని భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట లాలయ్య, జిల్లా నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి, కురవి సర్పంచ్ బాదావత్ లక్ష్మీరాజు నాయక్, బీఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు, మండల కార్యదర్శి నూతక్కి సాంబశివరావు, గ్రామ అధ్యక్షుడు కొణతం విజయ్, సంగెం భరత్, చిన్నం భాస్కర్, దడిగల రవి, మేక నాగిరెడ్డి, ఐలి నరహరి, బోడ శ్రీను, గుగులోత్ నెహ్రూ, జీవన్ తదితరులు పాల్గొన్నారు.