Isha Yoga Center | ఆధ్యాత్మికం పేరిట అరాచకం?.. చిన్నారులు స్నానం చేస్తున్న వీడియోలు పోస్ట్ చేసిన ఈషా సెంటర్
Isha Yoga Center | కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ మరోసారి వివాదంలో చిక్కుకుంది.
Isha Yoga Center | కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఈ కేంద్రానికి సంబంధించిన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో చిన్న పిల్లలు బహిరంగంగా స్నానం చేస్తున్న దృశ్యాలను వీడియో తీసి పోస్ట్ చేయడం కలకలం రేపింది. చిన్నారుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే కాకుండా, వారిని అసభ్యకర రీతిలో చిత్రీకరించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది ముమ్మాటికీ చైల్డ్ అబ్యూస్ కిందకే వస్తుందని, ఇలాంటి వీడియోలను రికార్డ్ చేసి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటని ఈషా సెంటర్‌తో పాటు జగ్గీ వాసుదేవ్‌ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు చిన్నారుల భద్రత మరియు హక్కుల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలు ఈ విషయంపై తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇది ‘పోక్సో’ (POCSO) చట్టం మరియు ఐటీ చట్ట నిబంధనల ఉల్లంఘన అని వారు ఆరోపిస్తున్నారు. ఆధ్యాత్మికత పేరుతో పిల్లల ప్రైవసీని పణంగా పెట్టడం అంగీకరించలేని విషయమని, వెంటనే ఈ వీడియోలను తొలగించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను మరియు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR)ను కోరుతున్నారు. ఇప్పటికే పలువురు సామాజిక కార్యకర్తలు ఈ వీడియో లింకులను సైబర్ క్రైమ్ పోలీసులకు ట్యాగ్ చేస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు.
Please take note of this perverted organisation recording and posting videos of girl children bathing. (Only sharing the link, not the video itself since I don’t want it to be circulated more). Take immediate action against these sick fellows…
— Mathur Sathya J (@captmatsat) February 16, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

