Rajpal Yadav : చెక్‌బౌన్స్ కేసులో తిహార్ జైలులో ఉన్న నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఢిల్లీ హైకోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ ఇంకా అతడు జైలులోనే ఉన్నాడు. బెయిల్‌కు సంబంధించి డాక్యుమెంట్ వర్క్ పూర్తి కాకపోవడంతో రాజ్‌పాల్ యాదవ్ జైలులోనే ఉండాల్సి ఉంటుంది. రాజ్‌పాల్ యాదవ్ రూ.9 కోట్ల చెక్ బౌన్స్ కేసులో ఇటీవల ఢిల్లీ పరిధి, తిహార్ జైలులో లొంగిపోయాడు. అతడికి బాలీవుడ్ సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు.
దీంతో కొంత నగదు జమ అయింది. ఇదే సమయంలో అతడి మేనకోడలు వివాహం జరగాల్సి ఉండగా.. అతడు ఈ పెళ్లికి హాజరయ్యేందుక మధ్యంతర బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇతరుల సాయంతో అందిన రూ.2.5 కోట్లను కోర్టులో డిపాజిట్ కూడా చేశారు. దీంతో కోర్టు సోమవారం అతడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ, అతడి తరఫు లాయర్లు డాక్యుమెంటేషన్ పూర్తి చేయకపోవడంతో సోమవారం విడుదల కాలేదు. నేటి మధ్యాహ్నం తర్వాత అతడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. తిహార్ జైలు నుంచి రాజ్‌పాల్ విడుదలైన తర్వాత అతడు ఉత్తర ప్రదేశ్‌లోని షహజన్‌పూర్ వెళ్తారు. అక్కడ మేన కోడలి వివాహ వేడుకలో పాల్గొంటారు. అతడు విడుదల కానుండటంపై సోదరుడు శ్రీపాల్ యాదవ్ హర్షం వ్యక్తం చేశాడు. తమ కుటుంబాలకు అతడే ప్రధాన ఆకర్షణ అని, అందరూ అతడి రాక కోసం ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చాడు.
రాజ్‌పాల్ యాదవ్ ప్రస్తుతం రూ.9 కోట్ల అప్పుకి సంబంధించి జైలులో ఉన్నారు. ఆయన ఈ నెల 5న తిహార్ జైలులో లొంగిపోయాడు. అతడు చెల్లించాల్సిన అసలు రూ.5 కోట్లు, వడ్డీ రూ.4 కోట్లు కలిసి మొత్తం రూ.9 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే, తన దగ్గర డబ్బులు లేవని, సాయం చేసేందుకు ఎవరూ లేరని జైలుకు వెళ్లేముందు ఆవేదనతో తెలిపాడు. దీంతో అతడికి సాయం చేసేందుకు బాలీవుడ్ సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్, వరుణ్ ధావన్ వంటి ప్రముఖులు సాయం అందించారు.