ములుగు, జనవరి30(నమస్తేతెలంగాణ): మేడా రం జాతర డ్యూటీలో ఉన్న కొంత మంది పోలీసు అధికారులు, సిబ్బంది భక్తులపై జులుం ప్రదర్శించారు. మేడారం సమ్మక్క,సారలమ్మ తల్లులను దర్శించుకోవడానికి శుక్రవారం లక్షలాదిగా భక్తం జనం తరలిరాగా, గంటల కొద్దీ క్యూ లో ఊపిరా పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. భక్తులను సాఫీగా ముందుకు పంపాల్సిన పోలీసు అధికారులు అవేమీ పట్టించుకోకుండా వీవీఐపీల చుట్టూ చక్కర్లు కొట్టడం, వారి దర్శ నానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
ఒత్తిడితో కొందరు క్యూలైన్ గ్రిల్స్ పైనుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయగా, వారిపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఎస్పీ మనన్భట్తోపాటుగా మరో ఇద్దరు యువ ఐపీఎస్లు, ఓ సీఐ, సిబ్బంది రక్తం వచ్చేలా చితకబాదారు. మహిళలను అని చూ డకుండా ఈడ్చి పడేశారు.
పోలీసు అధికారులు ఆదేశాలతో గ్రేహౌండ్స్, ఆర్ముడ్ రిజర్వు, లా అండ్ ఆర్డర్ బలగాలు రెచ్చిపోయి, ప్రధాన ద్వారం వైపు వచ్చిన భక్తులపై లాఠీలతో ప్రతాపం చూపడంతో కంటతడి పెట్టారు. హిజ్రాలను చితకబాదడంతో వారు శాపనార్థాలు పెట్టారు. కాగా, మేడారంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది వీఐపీ, వీవీఐపీ క్యూల వద్ద ఉన్న భక్తులను వెనక్కి నెట్టి వేసి వారి కుటుంబసభ్యులు, బంవులను ముందుకు పంపించడంతో తోపులాట జరిగింది. క్యూలు, గద్దెల ఎగ్జిట్ గేట్ల వద్ద పోలీసుల తీరుపై భక్తులు మండిపడ్డారు.